నన్ను చంపడానికి కుట్ర పన్నారు: మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-03-16T21:10:11+05:30 IST

అంతే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల సంఘం చేత టీఎంసీపై తప్పుడు కేసులు వేయడానికి చూస్తున్నరని మమతా బెనర్జీ అన్నారు.

నన్ను చంపడానికి కుట్ర పన్నారు: మమత బెనర్జీ

కోల్‌కతా: తనను చంపడానికి కుట్ర జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం బంకురలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులంతా హోటళ్లు బుక్ చేసుకున్న ప్రదేశంలోనే తనపై దాడి జరిగిందని, నిజానికి తనను చంపడానికి కుట్ర జరిగి కొద్దిలో తప్పిందని అన్నారు. అంతే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల సంఘం చేత టీఎంసీపై తప్పుడు కేసులు వేయడానికి చూస్తున్నరని మమతా బెనర్జీ అన్నారు.


ఇక భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తోందని అన్న ఆవిడ.. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే మీకంటూ హక్కులేమీ మిగలవు. వాళ్లు గెలిచిన మరు క్షణమే మీ హక్కులన్నీ ధ్వంసమైపోతాయి. బ్యాంకులన్నీ మూతపడతాయి’’ అని అన్నారు. కేంద్ర మంత్రులు ఏమాత్రం సిగ్గు లేకుండా తమ బాధ్యతల్ని వదిలేసి బెంగాల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘బెంగాల్‌లో ఎక్కడ చూసినా కేంద్ర మంత్రులే కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం తప్పితే వారికి ఇంకేం పని లేదా? వాళ్ల బాధ్యతలను మర్చిపోయి బెంగాల్‌లోనే మకాం వేశారు. కోవిడ్ మహమ్మారి, తుఫాను లాంటి పరిస్థితుల్లో ఒక్క కేంద్ర మంత్రి కనిపించలేదు. ఎన్నికలు రాగానే సిగ్గులేకుండా వాలిపోయారు’’ అని మమత అన్నారు. అంతే కాకుండా బయటి నుంచి వచ్చే గూండాలను అడ్డుకుని తీరతానని మమత శపథం చేశారు.

Updated Date - 2021-03-16T21:10:11+05:30 IST