పంటల బీమా సొమ్ము కాజేసేందుకు కుట్ర !

ABN , First Publish Date - 2022-01-22T06:19:57+05:30 IST

రైతుల కు బదులుగా తమ ఆధార్‌ నెంబర్‌ ఎక్కించి, వేలిముద్ర లు వేసి పంటల బీమా సొమ్ము కాజేసేందుకు ప్రయత్నిం చిన ఇద్దరు వ్యవసాయ సిబ్బందిని కలెక్టర్‌ నాగలక్ష్మి శుక్రవారం సస్పెండ్‌ చేశారు

పంటల బీమా సొమ్ము కాజేసేందుకు కుట్ర !

రైతులకు బదులుగా తమ ఆధార్‌ వేసిన ఇద్దరు

 వ్యవసాయ సిబ్బంది 

క్షేత్ర స్థాయి విచారణలో బహిర్గతం 

ఆ ఇద్దరిని సస్పెండ్‌  చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు 

అనంతపురం  వ్యవసాయం, జనవరి 21: రైతుల కు బదులుగా తమ ఆధార్‌ నెంబర్‌ ఎక్కించి, వేలిముద్ర లు వేసి పంటల బీమా సొమ్ము కాజేసేందుకు ప్రయత్నిం చిన ఇద్దరు వ్యవసాయ సిబ్బందిని కలెక్టర్‌ నాగలక్ష్మి శుక్రవారం సస్పెండ్‌ చేశారు.  2020 సంవత్సరం పంటల బీమాకు సంబంధించి అధిక విస్తీర్ణంతోపాటు అధిక మొత్తం మంజూరైన రైతుల వివరాలపై వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ డీడీఏ మురళి గతేడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో విచారించారు. ఈ సమయంలో ఆర్బీకే స్థాయి లో యల్లనూరు మండలం కల్లూరు వీహెచఏ బాలరాజు, విడపనకల్లు మండలం మలాపురం వీఏఏ రామచంద్రనా యక్‌లు పలువురు రైతులకు బదులుగా తమ ఆధార్‌  నెం బర్‌ ఎంటర్‌ చేసి వేలిముద్ర వేసుకున్నారు. ఎవరి ఆధార్‌ నెంబర్‌తో వేలిముద్ర వేస్తే వారి ఖాతాలోకి నేరుగా పంటల బీమా సొమ్ము జమ చేస్తూ వస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వీహెచఏ బాలరాజు ఏడుగురు రైతు లు, వీఏఏ రామచంద్రానాయక్‌ 22 మంది రైతులకు బదులుగా తమ ఆధార్‌ నెంబర్‌తో వేలిముద్రలు వేసినట్లు గుర్తించారు. వేరుశనగ, ఉద్యాన పంటలకు సంబంధించి ఒక్కో రైతుకు రూ.5లక్షలకుపైగా పంటల బీమా మంజూ రైనట్లు సమాచారం. ఎక్కువ మొత్తంలో పంటల బీమా మంజూరైన రైతులను విచారించే సమయంలో ఆ ఇద్దరు వ్యవసాయసిబ్బంది పంటల బీమా సొమ్ము కాజేసేందుకు చేసిన కుట్రను విచారణ అధికారి పసిగట్టారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. అలాగే ఆయా రైతుల ఆధార్‌ నెంబర్లతో వేలిముద్రలు వేయించి వారి ఖాతాలకు పంటల బీమా సొమ్ము జమచేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు నివేదించారు. త్వరలో ఆయా రైతుల ఖాతాలకు పంటల బీమా సొమ్ము జమ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-22T06:19:57+05:30 IST