Abn logo
Oct 11 2021 @ 12:25PM

విటుడిగా మారిన పోలీస్.. రూ. 500కు బేరం.. గదిలో అభ్యంతరకర స్థితిలో యువకుడు..క్షణాల్లో సీన్ మారిపోయింది!

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోగల కుఠ్లాలో జరుగుతున్న సెక్స్ రాకెట్‌కు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ వ్యభిచార గృహం నడుపుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళలతో పాటు అభ్యంతరకర స్థితిలో ఉన్న ఒక యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సెక్స్ రాకెట్ గుట్టును బట్టబయలు చేసేందుకు పోలీసులు ఒక కానిస్టేబుల్‌ను విటునిగా.. వ్యభిచారం జరుగుతున్న ఇంటికి పంపించారు. 

అతను రూ. 500కు ఒక మహిళతో బేరం కుదుర్చుకున్నాడు. తరువాత ఆ విషయాన్ని ఆ ఇంటి బయట కాపుకాస్తున్న పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసుల బృందం ఆ ఇంటిలోనికి ప్రవేశించి, వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ శివాజీ నగర్‌లో వ్యభిచారం జరుగుతున్నదని తమకు సమాచారం రావడంతో, వారిని పట్టుకునేందుకు ప్లానింగ్‌తో వెళ్లి, ఆ సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...