Abn logo
Sep 24 2021 @ 00:47AM

కానిస్టేబుల్‌ నిజాయితీ

- బస్సులో నగదు బ్యాగు మరిచిపోయిన మహిళలు 

- కండక్టర్‌కు అప్పగింత.. బాధితులకు డీఎం అందజేత

ధర్మవరం, సెప్టెంబరు 23: ఓ కానిస్టేబుల్‌ నిజాయితీని చాటుకున్నాడు. ఆర్టీసీ బస్సులో మరచిపోయిన నగదును ఆర్టీసీ సిబ్బందికి అందించిన సంఘటన గురు వారం బత్తలపల్లిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ధర్మవరం పట్టణంలోని వైఎస్‌ ఆర్‌ కాలనీకి చెందిన గిరిజమ్మ, రత్నమ్మ కదిరికి వెళ్లడానికి ధర్మవరం నుంచి అనంతపురానికి వెళ్లే బస్సు ఎక్కారు. అయితే వీరు బస్సు బత్తలపల్లికి చేరుకోగానే హడా వుడి లో నగదు బ్యాగును మరచిపోయి దిగేశారు. అదే బస్సులో ముదిగుబ్బలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ సురేశ్‌కుమార్‌ ఆ బ్యాగును గమనించి పక్క సీటులో ఉన్న ప్రయా ణికులను అడిగారు. ఎవరో ఇద్దరు మహిళలు మరచిపోయారేమోనని తెలిపారు. కానిస్టేబుల్‌ ఆ బ్యాగును తెరచి చూడగా అందులో రూ.35వేలు నగదు ఉంది. బ్యాగులో ఉన్న పేపర్లలో ఫోన్‌నెం బర్‌ ఉండటంతో ఆ నెంబర్‌కు పోన్‌చేసి బ్యాగు మరచిపో యిన విషయాన్ని కానిస్టేబుల్‌ తెలియజేశారు. అనంతరం ఆ బ్యాగును ఆర్డీసీ కండక్టర్‌, డ్రైవ ర్‌లకు అప్పగించారు. ఈ క్రమంలో వారు ఆ నగదును ఆర్డీసీ డీఎం మల్లికార్జునకు అందజేశారు. అనంతరం  బా ధితులు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని డీఎం కలవగా వారికి ఆ నగదును అప్పగించారు. ఆర్టీసీ అధికారులు కానిస్టేబుల్‌ సురేశ్‌కుమార్‌, కండక్టర్‌ కేఎస్‌ రావును అభినందించారు.