Constable‌కు ఝలక్‌ ఇచ్చిన కి‘లేడీ’

ABN , First Publish Date - 2021-11-17T16:34:12+05:30 IST

లిఫ్ట్‌ అడిగి వాహనం ఎక్కి, అదును చూసి వాహనదారుడి మెడలోని బంగారు ఆభరణాలు కొట్టేయడం ఆమెకు అలవాటు. ఇలానే నాలుగు రోజుల క్రితం ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ బంగారు గొలుసు కొట్టేసింది కిలాడి లేడీ. పంజాగుట్ట

Constable‌కు ఝలక్‌ ఇచ్చిన కి‘లేడీ’

లిఫ్ట్‌ పేరుతో బైకెక్కి గొలుసు చోరీ

హైదరాబాద్/పంజాగుట్ట: లిఫ్ట్‌ అడిగి వాహనం ఎక్కి, అదును చూసి వాహనదారుడి మెడలోని బంగారు ఆభరణాలు కొట్టేయడం ఆమెకు అలవాటు. ఇలానే నాలుగు రోజుల క్రితం ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ బంగారు గొలుసు కొట్టేసింది కిలాడి లేడీ. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ సౌభాగ్య నగర్‌ కాలనీకి చెందిన ఈశ్వర్‌ ప్రసాద్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌. ఓ న్యాయమూర్తి వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12 రాత్రి 10 గంటల ప్రాంతంలో విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. అమీర్‌పేట డీకే రోడ్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా ఓ యువతి లిఫ్ట్‌ అడిగింది. మానవతాధృక్పథంతో ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చాడు. పంజాగుట్ట చౌరస్తాలో ఆమె దిగిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మెడ తడుముకోగా బంగారు గొలుసు కనిపించలేదు. వెంటనే వెనక్కి వచ్చి ఆమె కోసం గాలించగా కనిపించ లేదు. తాను విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో వెదికినా దొరకలేదు. తాను లిఫ్ట్‌ ఇచ్చిన యువతి దొంగిలించినట్లు భావించాడు. 22 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురైనట్లు ఈ నెల 14న పంజాగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. నిందితురాలు బెంగుళూరుకు చెందిన అంజు (36)గా గుర్తించి మహంకాళి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2021-11-17T16:34:12+05:30 IST