రూ.4 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2020-09-25T10:41:44+05:30 IST

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం రూ.4 కోట్ల అంచనాతో ఏటుకూరు రోడ్డులోని విష్ణుప్రియనగర్‌లో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.

రూ.4 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం

గుంటూరు, సెప్టెంబరు 24: నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం రూ.4 కోట్ల అంచనాతో ఏటుకూరు రోడ్డులోని విష్ణుప్రియనగర్‌లో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. ఈ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో బొంతపాడుడొంక, బావాజీనగర్‌, కమ్మశేషయ్యగ్రౌండ్‌, సాయిబాబాకాలనీ, ఉడా రోడ్డు, బుడంపాడు ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.


కార్యక్రమంలో విద్యుత్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ విజయకుమార్‌, ఈఈలు హరిబాబు, శ్రీనివాసరావు, డిప్యూటీ ఈఈ సురేష్‌బాబు, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు షేక్‌ షౌకత్‌, సంకూరి శ్రీను, హరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T10:41:44+05:30 IST