అన్ని గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-06-22T03:34:34+05:30 IST

ప్రభుత్వం ఇటీవల కేటాయించిన స్థలాల్లో అన్ని గృహాల నిర్మాణం జరిగేలా శ్రద్ధ తీసుకోవాలని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ వైదేష్‌ఖరే స్థానిక అధికారులను ఆదేశించారు.

అన్ని గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోండి
తల్లంపాడు వద్ద లేవుట్‌లో స్థలాలను పరిశీలిస్తున్న జేసి విదేష్‌ఖరే

హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ వైదేష్‌ఖరే

సూళ్లూరుపేట, జూన్‌ 21 : ప్రభుత్వం ఇటీవల కేటాయించిన స్థలాల్లో అన్ని గృహాల నిర్మాణం జరిగేలా శ్రద్ధ తీసుకోవాలని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ వైదేష్‌ఖరే స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మన్నారుపోలూరు శివార్లల్లో 1022 మందికి ఇంటి స్థలాలను కేటాయించింది. తొలి విడత 504 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి రుణాలను మంజూరు చేసింది. అందులో 40 గృహాలకు మాత్రమే పునాదులు వేసినా  మిగిలిన వాటిని అలాగే ఉంచటంతో హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌  అన్ని స్థలాల్లోనూ ఇళ్లు నిర్మించేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.  స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, హౌసింగ్‌ ఏఈ అక్రమ్‌  పాల్గొన్నారు.

నాయుడుపేట : నాయుడుపేట మున్సిపాలిటీలోని అయ్యప్పరెడ్డిపాళెం, శ్రీనివాసాపురంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లను హౌసింగ్‌ జేసీ విడేహాఖరే సోమవారం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎంత మంది లబ్ధిదారులకు ఈ రెండు లేఅవుట్‌లలో ఇళ్లు మంజూరై ఉన్నాయని ఎంత మంది పనులు ప్రారంభించి ఉన్నాయని వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, హౌసింగ్‌ డీఈ, ఎఈ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. 

దొరవారిసత్రం : మండలంలోని తల్లంపాడు వద్ద స్థలాల లేవుట్‌ను జిల్లా హౌసింగ్‌ స్పెషల్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదే్‌హ్‌ఖరే సోమవారం పరిశీలించారు. లేవుట్‌ లెవలింగ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్త పరిచారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని, లబ్ధిదారులను ప్రోత్సహించాలని గృహనిర్మాణశాఖ అధికారులకు సూచించారు. ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T03:34:34+05:30 IST