Advertisement
Advertisement
Abn logo
Advertisement

తండ్రి భవనాలు నిర్మిస్తుంటే... కూతురు దేశాన్ని...

తిరువనంతపురం: యూపీఎస్సీని కొల్లగొట్టడం చాలామందికి ఓ జీవితకాల స్వప్నం. కొందరు మాత్రమే దానిని సాకారం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు కేరళకు చెందిన అవస్థి ఎస్. తిరువనంతపురానికి చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె. సివిల్ సర్వెంట్ కావాలన్న తన కలను సాకారం చేసుకుని శభాష్ అనిపించుకుంది. యూపీఎస్సీ పరీక్ష 2020లో అవస్థి 481వ ర్యాంకు సాధించింది. 


సివిల్ సర్వెంట్ కావాలనేది తన 15 ఏళ్ల కల అని ఈ సందర్భంగా అవస్తి చెప్పుకొచ్చింది. ఐఏఎస్ అధికారి కావాలనేది తన కోరిక అని, దానిని సాధించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. తండ్రి నిర్మాణ రంగంలో ఉంటూ భవనాలు నిర్మిస్తుంటే, అతడి కుమార్తె దేశ నిర్మాణంలో పాలుపంచుకోనుండడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ ఊపిరి సలపకుండా ఉన్నప్పటికీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులను అభినందించడం మర్చిపోలేదు. ప్రజా సేవలో వారి కోసం సంతృప్తికరమైన కెరియర్ ఎదురుచూస్తోందని మోదీ అన్నారు.  


కొద్దిలో ర్యాంకులు కోల్పోయిన వారిని ఉద్దేశించి మోదీ ట్వీట్ చేస్తూ.. యూపీఎస్సీ పరీక్షల్లో విఫలమైన వారికి తాను ఒకటే చెప్పాలనుకుంటున్నానని, వారిలో చాలా ప్రతిభ ఉందని అన్నారు. మరిన్నిసార్లు పరీక్షలు రాసి సాధించాలని సూచించారు. ఇండియాలో విభిన్నమైన అవకాశాలు ఉన్నాయని, దేనినైనా ఎంచుకోవచ్చన్నారు.  


నిన్న విడుదలైన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో మొత్తం 761 మంది ర్యాంకులు సాధించారు. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు.  బీహార్‌కు చెందిన శుభ్‌మన్ కుమార్, మధ్యప్రదేశ్‌కు చెందిన జాగృతి అవస్థి వరుసగా ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement