రూ.37 లక్షలతో కల్వర్టు నిర్మాణం

ABN , First Publish Date - 2021-06-14T06:04:43+05:30 IST

బోయినిపేట వాసుల కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం నుంచి మంజూరుచేయించిన రూ.37లక్షలతో కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు వెల్లడించారు.

రూ.37 లక్షలతో కల్వర్టు నిర్మాణం
కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

మంథని, జూన్‌ 13: బోయినిపేట వాసుల కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం నుంచి మంజూరుచేయించిన రూ.37లక్షలతో కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు వెల్లడించారు. నాలుగేళ్ళుగా కుంగిపోయిన కల్వర్టుతో ఇబ్బందు లు పడుతున్న బోయినిపేటవాసుల కష్టాలు తొలగనున్నాయని చెప్పారు. మంథని మున్సిపల్‌ పరిఽదిలోని బోయినిపేట సమీపంలో ముత్తెంపాయ మీద కొనసాగుతు న్న కల్వర్టు నిర్మాణాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు ఆదివారం పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో త్వరగా కల్వర్టు నిర్మాణం పనులు పూర్తి చేయాలని సూచించారు. తాను బోయినిపేటలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్వర్టు నిర్మాణం పనులు మొదలు పెట్టించినట్లు తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు వీకే. రవి, కాయితి సమ్మయ్య, ఆకుల శ్రీనివాస్‌లున్నారు.


Updated Date - 2021-06-14T06:04:43+05:30 IST