చివరి దశకు ఐఓసీ డిపో నిర్మాణం

ABN , First Publish Date - 2021-05-06T06:19:05+05:30 IST

భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టిన ఐఓసీ ఇంధన డిపో పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో పనులు పూర్తికానుండగా స్థానికులకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

చివరి దశకు ఐఓసీ డిపో నిర్మాణం
ఐఓసీ గిడ్డంగులు


గుంతకల్లు, మే 5: భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టిన ఐఓసీ ఇంధన డిపో పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో పనులు పూర్తికానుండగా స్థానికులకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మండలంలోని నక్కనదొడ్డి గ్రామ సమీపంలో రెండేళ్ల కిందట చేపట్టిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఇంధన గిడ్డంగి నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. గుంతకల్లులో ఉన్న ఐఓసీ మూతపడటం, బీపీసీ, హెచ్‌పీసీ గిడ్డంగులు గుత్తికి తరలిపోవడంతో స్థానికంగా ఉన్న ట్రక్కు కార్మికులు ఉపాధి కోల్పోయారు. కాగా రెండేళ్ల కాలవ్యవధిలో నూతన గిడ్డంగి పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమౌతుండటంతో స్థానికులలో హర్షం వ్యక్తం అవుతోంది. 

పట్టణంలోని రైల్వే పరిధిలో రెండేళ్ల కిందట ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం ఖనిజ నూనెల గి డ్డంగులు ఉండేవి. గుంతకల్లు రైల్వే స్టేషన్‌ విస్తృతం కావడం, డీజల్‌ ఇంజన్ల స్థానంలో విద్యుత్‌ లోకోలు రా వడం కారణాలుగా ఈ ఇంధన గిడ్డంగుల నిర్వహణ ప్రమాదంలో పడింది. దీనికితోడు ఆయిల్‌ ఇండస్ట్రీ సేఫ్టీ డైరెక్టరేట్‌ (ఏఐఎ్‌సడీ) ఈ మూడు కంపెనీల ఫ్యూ యల్‌ ఇంపోర్టు పాయింట్‌, ర్యాంపుల పరిస్థితి సరిగా లేదని భద్రతా ప్రమాణాలు లేవని అభ్యంతరం తెలిపింది. దీంతో బీపీసీ, హెచ్‌పీసీ సంస్థలు గుత్తికి తరలిపోగా, ఐఓసీ నక్కనదొడ్డి వద్ద భారీస్థాయిలో ఇంధన డిపోను నిర్మించడానికి 2017లో కార్యాచరణను రూ పొందించింది. రూ. 325 కోట్ల అంచనా వ్యయంతో  భారీ స్థాయిలో ఖనిజ నూనెలను నిల్వచేయదగ్గ స్థా యిలో ఈ డిపో నిర్మాణం ప్రారంభమైంది. గుంతకల్లు లో మూతపడిన ఐఓసీ డిపో 55 వేల కేఎల్‌ సామర్థ్యం ఉన్న ఇంధన గిడ్డంగిగా ఉండింది. ప్రస్తుతం నక్కనదొడ్డి వద్ద ఐఓసీ సంస్థ ఇంధన డిపోను నిర్మించడానికి 2018లో 82.77 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సేకరించింది. 2019లో రూ. 325 కోట్లతో 16,412 కిలో లీటర్ల స్టోరేజి నిర్మాణాన్ని చేపట్టారు. రెం డేళ్ల కాలంలో దాదాపుగా నిర్మాణ పనులన్నీ పూర్తయ్యా యి. ఈ సెప్టెంబరుకల్లా పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులను నిర్వహిస్తున్నారు. ఇంధన నిల్వలను ఉంచడానికి అవసరమయ్యే ఆయిల్‌ ట్యాంకుల నిర్మాణం, ర్యాంపులు, రైల్వే అన్‌లోడింగ్‌ పాయింట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం గుంతకల్లు-గుత్తి రైలు మార్గానికి ఐఓసీకి అనుసంధానించే ట్రాక్‌ నిర్మాణం, లింకింగ్‌ పనులు, భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 


2500 మందికి ఉపాధి అవకాశాలు

నక్కనదొడ్డి ఐఓసీ డిపో పూర్తయితే దాదాపు 2500 మంది స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ వర్కర్లకు ఉపాధి లభిస్తుం ది. ఈ డిపోలో ఆయిల్‌ లోడింగ్‌ 24 ర్యాంపులను ని ర్మిస్తున్నారు. ఈ మేరకు అథమపక్షం 400 ఆయిల్‌ ట్యాంకర్లతో ఇంధన రవాణా సాధ్యపడుతుంది. దీం తో ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు, క్లీన ర్లు కలిపి దాదాపుగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇక పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి లభించే అవకాశాలేర్పడనున్నాయి.


Updated Date - 2021-05-06T06:19:05+05:30 IST