కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-06-22T05:28:30+05:30 IST

కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన
జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి రాధారాణిని జ్ఞాపికతో సత్కరిస్తున్న బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

వికారాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రతిపాదించిన జిల్లా కోర్టు భవన సముదాయం నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి రాధారాణి స్థల పరిశీలన చేశారు. సోమవారం కోర్టు భవన సముదాయం నిర్మాణం కోసం ఆమె మేకలగండిలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె వికారాబాద్‌ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న కోర్టు ఆవరణలోనే కొత్త కోర్టు భవన సముదాయం నిర్మించాలని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, సీనియర్‌ న్యాయవాదులు జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జిని కోరారు. కోర్టు పక్కనే ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయం స్థలం తీసుకుంటే మొ త్తం 5ఎకరాల్లో కోర్టు భవనం నిర్మించుకునేందు కు అవకాశం ఉంటుందనే విషయాన్ని హైకోర్టు న్యాయాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు, కక్షిదారులకు అందుబాటులో ఉండేలా స్థలం ఎంపిక చేయాలని కోరారు. ప్రస్తుత కోర్టు భవనంతో పాటు ఉద్యాన శాఖ స్థలమైనా కక్షిదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని జడ్జి దృష్టికి తెచ్చారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ సభ్యులు జడ్జి రాధారాణిని సన్మానించారు. ఆమె కోర్టు ఆవరణతో పాటు మెజిస్ర్టేట్‌ నివాస గృహాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ కోర్టు ఇన్‌చార్జి జడ్జి స్వాతి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.నాగరాజు, కార్యదర్శి రమేష్‌, ఉపాధ్యక్షుడు రమే్‌షగౌడ్‌, సీనియర్‌ న్యాయవాదులు హన్మంత్‌రెడ్డి, ఎన్‌.బస్వరాజ్‌, చౌదరి యాదవరెడ్డి, లవకుమార్‌, గోపాల్‌రెడ్డి, సంపూర్ణఆనంద్‌, మాధవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:28:30+05:30 IST