నత్తనడకన నీటి ట్యాంకుల నిర్మాణం

ABN , First Publish Date - 2021-10-18T05:45:05+05:30 IST

పట్టణానికి ఫ్లోరైడ్‌ రహిత తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు రెండేళ్లయినా నత్తనడకనే సాగుతున్నాయి.

నత్తనడకన నీటి ట్యాంకుల నిర్మాణం
నిర్మాణంలో ఉన్న ట్యాంకు

మడకశిరలో తప్పని తాగునీటి ఇబ్బందులు

పనులు పూర్తయితే తాగునీటి సమస్యకు చెక్‌ 

నేటికీ 30 శాతం పనులే పూర్తి

మడకశిర, అక్టోబరు 17 : పట్టణానికి ఫ్లోరైడ్‌ రహిత తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు రెండేళ్లయినా నత్తనడకనే సాగుతున్నాయి. వేసవిలో పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటోంది. పలుమా ర్లు పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పట్టణంలో తాగునీటి సమ స్యను శాశ్వతంగా పరిష్కరించి, ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలో రెండేళ్ల కిందట ప్రతి ఇంటికీ రోజూ తాగునీటిని అందిం చేందుకు కాంప్రహెన్సివ్‌ వాటర్‌సప్లయ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పథకం కింద రూ.64కోట్ల నిధులు మంజూరు చేసింది. ఏఐఐబీ (ఏషియన ఇనఫార్‌స్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు) ద్వారా 70 శాతం, ప్రభుత్వం నుంచి 30 శాతం నిధులతో ఈపనులు జరుగుతున్నాయి. ఈ పథకం పనులు రెండేళ్ల లో పూర్తి కావాల్సి ఉంది. అలా కాకపోవటంతో  మరో రెండేళ్లలో పనులు పూర్తి చేసేందుకు గడువును పొడిగించి నట్లు సంబంధిత శాఖ అధికారుల సమాచారం. పట్టణ సమీపంలోని చెరువులో సంపు, ఏడు చోట్ల ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు 30 శాతం పనులే జరిగినట్లు అధికారుల సమాచారం.  మడకశిర చెరువులో సంపు ఏర్పాటుచేసి,  పక్కనే ఉన్న గుట్టపై వాటర్‌ప్లాంటు నిర్మించి, అక్కడ నీటిని శుద్ధిచేసి, మెళవాయి వద్ద నిర్మిం చిన ట్యాంకుకు పైపుల ద్వారా  సరఫరా చేస్తారు. అక్కడ నుంచి పట్టణానికి రోజూ తాగునీటిని అందించనున్నారు. పట్టణంలో 7 ట్యాంకులను నిర్మిస్తున్నారు. జూనియర్‌ కళా శాల ఆవరణలో 7లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు, ఎస్సీ కాలనీలో 5లక్షలలీటర్లు, పావగడ రోడ్డు సమీపంలో 6లక్షలలీటర్లు, బేగార్లపల్లి, మారుతీనగర్‌, గొల్లహట్టి, మల్లి నాయకనపల్లిలో ఒక్కొక్కచోట 3లక్షల లీటర్ల సామ ర్థ్యంగల ట్యాంకులను నిర్మిస్తున్నారు. మెళవాయిగుట్టపై ఉన్న సంపు నుంచి పైప్‌లైన్లద్వారా ఫిల్టర్‌ అయిన నీటిని పట్టణంలో నిర్మించిన ట్యాంకులకు సరఫరా చేసి ప్రతి ఇంటికి నీటిని అందించే విధంగా పనులు జరుగుతున్నా యి. మడకశిర పట్టణంలో 26 వేల జనాభా ఉంది. 30 సంవత్సరాల తరువాత కూడా పెరిగిన జనాభాకనుగుణం గా నీటి సమస్య తలెత్తకుండా ఉండేవిధంగా ముందు జాగ్రత్తగా ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం ఈ పథకం పూర్తయితే 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తారు.  ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణాలు 50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేవిధంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి కొళాయి ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి 135 లీటర్ల నీటిని అందించనున్నట్లు అధికారుల సమాచారం. ఈ పథకం పనులు పూర్తయితే మడకశిరలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. 


సంవత్సరంలోగా తాగునీటి పథకం పనులు పూర్తి : సత్యనారాయణ, మున్సిపల్‌ ఏఈ 

ఏడాదిన్నరలోగా తాగునీటి పథకం పనులు పూర్తి చేసి పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తాం. ప్రస్తుతం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 30 శాతం పనులు పూర్తయ్యాయి. పట్టణంలో శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాంప్రహెన్సివ్‌ వాటర్‌సప్లయ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పథకం కింద రూ.64కోట్ల నిధులు మంజూరయ్యాయి. రెండేళ్లలో ఈపథకం పనులు పూర్తికావాల్సి ఉంది. కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. పనులు పూర్తి చేసేందుకు మరో రెండేళ్లపాటు గడువును పొడిగించారు. 

Updated Date - 2021-10-18T05:45:05+05:30 IST