భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-01T04:35:08+05:30 IST

నూతన సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మా ణ పనులను వేగవంతం చేసి పనులకు తుది రూ పం తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు.

భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

- జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు 

- సమీకృత కలెక్టర్‌ కార్యాలయ పనులపై అధికారులతో సమీక్ష


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), నవంబరు 30 : నూతన సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మా ణ పనులను వేగవంతం చేసి పనులకు తుది రూ పం తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నూతన సమీకృత కలెక్టర్‌ కార్యా లయ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షిం చారు. భవన నిర్మాణంలో మిగిలిన పనులను వేగ వంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా సమావేశ మందిరంలో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, విద్యుత్‌ పనులు, ఆడియో, విజువల్‌ పనులు, ఆర్చ్‌, స్టేట్‌ బోర్డ్‌ రూమ్‌ పనులను, ఆర్చి, ఐలాండ్‌, సెం ట్రల్‌ మీడియన్‌ పనులు వెంటనే పూర్తి చేయా లని, అదేవిధంగా, హెలిప్యాడ్‌ పనులకు సంబం ధించి తక్షణమే మరోసారి లేఖ రాయాలని ఆయన సూచించారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్త రణ పనులపై, దేవరకద్ర రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పను లపై కూడా కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామా రావు, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, ఏఎస్‌ఈలు, ఆర్డీఓ, డీపీవో తదితరులు పాల్గొన్నారు.


 ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి

జిలాలోని ఆయా ప్రాజెక్టుల కింద పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ప్రతీ మంగళవారం నిర్వహించే భూసేకరణలో భాగంగా ఈ మంగళ వారం ఆయన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్‌ అధికారులు, రెవె న్యూ అధికారులతో భూసేకరణపై వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. ముందుగా కోయిల్‌సాగర్‌ ప్రా జెక్టుకు భూసేకరణ పనులను ఇంజనీరింగ్‌ అధికా రులు, రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తూ గ్రావిటీ కెనాల్‌, ప్రధాన ఎడమకాలువ తదితర భూసేకరణ పనులపై ఆరా తీశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పనులు వేగవంతం చే యాలని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ తహసీల్దార్ల తో మాట్లాడుతూ పోడు భూములకు సంబంధిం చిన దరఖాస్తులను వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సంబంధిత ఇంజనీర్లు, అధికారులు, తహసీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

Updated Date - 2021-12-01T04:35:08+05:30 IST