ఎవ్వరినీ తాకే చాన్స్‌ లేదు!

ABN , First Publish Date - 2020-05-24T08:20:19+05:30 IST

దేశీయ విమాన సర్వీసులను సోమవారం నుంచి పునరుద్ధరించనున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎవ్వరినీ తాకే అవకాశం లే కుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం...

ఎవ్వరినీ తాకే చాన్స్‌ లేదు!

  • పార్కింగ్‌ టు బోర్డింగ్‌ కాంటాక్ట్‌లెస్‌ జర్నీ
  • బెంగళూరు విమానాశ్రయంలో ఏర్పాట్లు

బెంగళూరు, మే 23: దేశీయ విమాన సర్వీసులను సోమవారం నుంచి పునరుద్ధరించనున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎవ్వరినీ తాకే అవకాశం లే కుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. ‘మేం వినూత్న కాంటాక్ట్‌లెస్‌ విధానాలను ప్రవేశపెట్టాం. ప్రయాణికుల భద్రతపై మా నిబద్ధతకు ఇదే నిదర్శనం. మా ఈ చర్యలు ప్రయాణికుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తాయని భావిస్తున్నాం’ అని విమానాశ్రయ సీఈవో హరి మరర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చెక్‌-ఇన్‌, సెక్యూరిటీ చెక్‌, బోర్డింగ్‌, రిటైల్‌ అండ్‌ డైనింగ్‌, పార్కింగ్‌, ఆన్‌ అరైవల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ తదితర అంశాల్లో కాంటాక్ట్‌లెస్‌ విధానాలు తీసుకొచ్చామని, దీంతోపాటు శానిటైజేషన్‌, ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరి అని తెలిపారు. 


Updated Date - 2020-05-24T08:20:19+05:30 IST