కాంటాక్ట్‌ ట్రేసింగ్‌తో కరోనాకు బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-05-23T05:30:00+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అందరూ ఏకమై పోరాడుతున్నారు. కరోనా పైపోరుకు గూగుల్‌, యాపిల్‌ సంస్థలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. తాజాగా ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టెక్నాలజీ’ పేరుతో కొత్త సాంకేతికతను...

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌తో కరోనాకు బ్రేక్‌!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అందరూ ఏకమై పోరాడుతున్నారు. కరోనా పైపోరుకు గూగుల్‌, యాపిల్‌ సంస్థలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. తాజాగా ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టెక్నాలజీ’ పేరుతో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాయి. కరోనా ట్రేసింగ్‌ కోసం వాడుకలో ఉన్న యాప్‌లకు ఈ సాంకేతికత ఉపకరించనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 23 దేశాలు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టెక్నాలజీ కావాలని కోరినట్టు గూగుల్‌ ప్రకటించింది.


కొవిడ్‌-19కు సంబంధించిన యాప్‌లు ఉపయోగించే వారు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిని సమీపించినప్పుడు అలర్ట్‌ రూపంలో సందేశం వస్తుంది. ఇలాంటి టెక్నాలజీ మూలంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్‌ అవుతుందనే భయం అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్‌, యాపిల్‌ సంస్థలు తీసుకొచ్చిన సాంకేతికత, భద్రతను కల్పిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వినియోగదారులు ఎప్పుడైనా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను టర్నాఫ్‌ చేసుకునే వీలుంటుంది. జీపీఎస్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ చేయడం ద్వారా కరోనా పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించే యాప్‌లు చాలా వచ్చాయి. అయితే వాటివల్ల వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే గూగుల్‌, యాపిల్‌ సంస్థలు కొత్త సాంకేతికను తీసుకొచ్చాయి. 

Updated Date - 2020-05-23T05:30:00+05:30 IST