గుంటూరు జిల్లాలో.. నాలుగు కేసులు దాటితే కంటైన్మెంటే..

ABN , First Publish Date - 2020-09-23T14:30:52+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు పాజిటివ్‌ కేసులుకన్నా ఎక్కువగా నమోదైతే..

గుంటూరు జిల్లాలో.. నాలుగు కేసులు దాటితే కంటైన్మెంటే..

వైరస్‌ వ్యాపిస్తోన్న గ్రామాలపై దృష్టి సారించాలి

బాధితులను చేర్చుకోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు నోటీసులు

కరోనాపై సమీక్షలో కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో   నాలుగు పాజిటివ్‌ కేసులుకన్నా ఎక్కువగా నమోదైతే కంటైన్మెంట్‌ ప్రాంతంగా ప్రకటించాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులను ఆదేశిం చారు. కరోనా వైరస్‌ నివారణా చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళ వారం ఆయన కలెక్టరే ట్‌ లోని వీడియో కా న్ఫరెన్స్‌ హాల్‌లో సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కంటైన్మెంట్‌ గ్రామాల్లో రాకపోకలను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైర స్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రైమరీ, సెకండరీ కాం టాక్ట్స్‌ గుర్తించేందుకు గతంలో మాదిరిగా సచివాలయ ఉద్యో గులతో సర్వైలెన్స్‌ చేయించి పూర్తిగా శానిటేషన్‌ చేయించాలని ఆదేశించారు. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఫీవర్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారిని, ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్‌ను నిరంతరం పర్యవేక్షిం చాలన్నారు. 


తీవ్ర అనారోగ్య లక్షణాలున్న వారిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో చేర్చుకునివారిని పరీ క్షించిన తర్వాత కొవిడ్‌ ఆసుపత్రులకు తర లించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద పాజిటివ్‌ వ్యక్తులను చేర్చుకోవడానికి నిరాకరించిన ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో జేసీలు ఏఎస్‌ దినేష్‌ కుమార్‌, పీ ప్రశాంతి, జిల్లా కొవిడ్‌ ఓఎస్‌డీ బాబురావు, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జే యాస్మిన్‌, జీజీహెచ్‌ సూపరిండెంట్‌ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T14:30:52+05:30 IST