Advertisement
Advertisement
Abn logo
Advertisement

మొక్కల పెంపకంతో కాలుష్యాన్ని అడ్డుకోవాలి

చిలుకూరు, డిసెంబరు 2 : పర్యావరణ కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే సరైన మార్గమని పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ అన్నారు. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులతో గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం పెరగడం, అడవులను నరికివేయడంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యానర్లు, చార్టుల ద్వారా పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పించారు. 


Advertisement
Advertisement