బ్యాంకులకు... 27 నుంచి వరుస సెలవులు...

ABN , First Publish Date - 2021-03-21T23:57:52+05:30 IST

బ్యాంకులకు వరుస సెలవులొస్తున్నాయి. ఈ నెల చివరి నుంచి వచ్చే నెల ఆరంభంలో కూడా కొన్ని రోజులు బ్యాంకులపాటు పని చేయవు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

బ్యాంకులకు... 27 నుంచి వరుస సెలవులు...

హైదరాబాద్ : బ్యాంకులకు వరుస సెలవులొస్తున్నాయి. ఈ నెల చివరి నుంచి వచ్చే నెల ఆరంభంలో కూడా కొన్ని రోజులు బ్యాంకులపాటు పని చేయవు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. బ్యాంకులు ఈ నెల(మార్చి) 27 నుంచి ఏప్రిల్ 4 వరకు... కేవలం రెండు రోజులు మాత్రమే పని చేస్తాయి. ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడేస్ ప్రకారం... బ్యాంకులు దాదాపు వారం రోజులు పని చేయకపోవచ్చు. అయితే ఈ సెలవులు ప్రాంతం ప్రాతిపదికన మారతాయి.


ఈ నెల 27 నుంచి 29 వరకు... వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ నెల 27 న నాలుగో శనివారం, 28 న ఆదివారం, 29 న హోలీ పండుగ. ఈ క్రమంలో... ఈ మూడు రోజులూ బ్యాంకులు క్లోజ్. తర్వాత మార్చి 30 న పాట్నాలో హాలిడే ఉంది. మార్చి 31 న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు.


అలాగే ఏప్రిల్ 1 న కూడా బ్యాంక్ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఎందుకంటే... బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్/ఓపెనింగ్ ప్రక్రియల్లో ఉంటాయి. ఇక... ఏప్రిల్ 2 న గుడ్ ఫ్రైడే. అంటే బ్యాంకులు తొమ్మిదిరోజుల్లో దాదాపు ఏడు రోజులు పని చేయవు. ఈ నేపధ్యంలో... బ్యాంకులో పని ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం బెటర్.

Updated Date - 2021-03-21T23:57:52+05:30 IST