కంట్మోనెంట్‌ జోన్‌గా నేరెడ

ABN , First Publish Date - 2020-09-21T06:25:27+05:30 IST

మండలంలో నేరెడ గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు తహసీల్దార్‌ తిరుమలాచారి

కంట్మోనెంట్‌ జోన్‌గా నేరెడ

చింతకాని, సెప్టెంబరు 20: మండలంలో నేరెడ గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు తహసీల్దార్‌ తిరుమలాచారి తెలిపారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ సోమవారం నుంచి గ్రామంలో మధ్యాహ్నం 2గంటల వరకే అన్నిషాపులు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.


ఈ నిబంధనలను ఎవరైనా వ్యతిరేకిస్తే అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ఇటీవల కరోనాతోచనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, వైద్యాధికారి నాగేశ్వరరావు, ఆర్‌ఐ బుల్లిబాబు, ఏఎ్‌సఐ శ్రీనివాసరావు, గ్రామ ఉపసర్పంచ్‌ దూసరి గోపాలరావు, కార్యదర్శి వేముల నాగేశ్వరరావు, ఏఎన్‌ఎం పద్మ, గొర్రెముచ్చు శ్రీను, ఆశవర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:25:27+05:30 IST