పీటీఐలపై..కొవిడ్‌ పంజా

ABN , First Publish Date - 2021-06-18T05:13:51+05:30 IST

కరోనా వై రస్‌ వందల కు టుంబాలను ఛి న్నాబిన్నం చేసింది..

పీటీఐలపై..కొవిడ్‌ పంజా
మారువేశంలో భిక్షాటన చేస్తున్న కురుమూర్తి

- 14 నెలలుగారీ-ఎంగేజ్‌ చేయని రాష్ట్ర సర్కారు 


కల్వకుర్తి అర్బన్‌, జూన్‌ 17 : కరోనా వై రస్‌ వందల కు టుంబాలను ఛి న్నాబిన్నం చేసింది.. వేల మందికి ఉపాధి లేకుండా చేసింది.. ఫ లితంగా వారు రోడ్డున పడాల్సి వచ్చింది.. పూట గడపుకోవడం కోసం కొంద రు భిక్షాటన చేయాల్సిన ద యనీయ పరిస్థితులను కల్పిం చింది.. అందులో ప్రభుత్వ పా ఠశాలల్లో పని చేస్తున్న పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు (పీటీఐ)గా పని చేసే వృత్తి విద్యా శిక్షణ బోధకులపై మరింత ప్రభావాన్ని చూపింది. 

సర్వశిక్ష అభియా న్‌ అధ్వర్యంలో రోస్ట ర్‌ పద్ధతిలో 2012-13లో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో పీటీఐలను నియమించింది. అం దులో భాగంగా నాగ ర్‌కర్నూల్‌ జిల్లాలోని 131 జడ్పీహెచ్‌ఎస్‌ లు ఉండగా, వీటిలో 86 మంది పీటీఐల ను విధుల్లోకి తీసు కుంది. ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున వేతనాలు అందిస్తోం ది. అయితే, ఇందు లో కేంద్ర ప్రభుత్వం వాటాగా 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభు త్వం వాటాగా 40 శాతం నిధులు సమ కూర్చి, ప్రతీ నెల వీ రికి వేతనాలు అంది స్తున్నాయి. అయితే, ఏనిమిదేళ్లుగా వీరి సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్ర స్తుతం కొవిడ్‌-19 సాకుతో వీరిని రోడ్డున పడేసింది. వీరిని రీ-ఎంగేజ్‌కు పిలువకుండా జాప్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రక్రియను నిలిపి వేసింది. రాష్ట్ర విద్యా శాఖ కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. దీం తో కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 14 నెలలుగా వీ రికి వేతనాలు లేక పూట గడవటం కష్టంగా మారింది. ఇతర పనులు చేసుకుందామన్నా కరోనా ప్రభావంతో స్థానికంగా ఎలాంటి ఉపాధి లేక కుటుంబాలతో సహా పస్తులుండాల్సి వస్తోంది.

ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకున్న తర హాలోనే తమనూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పీటీఐలు కోరుతున్నా రు. నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చే స్తున్నారు. అలాగే రీ-ఎంగేజ్‌ ప్రక్రియను ప్రారంభించి, తమ కుటుం బాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-06-18T05:13:51+05:30 IST