Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం..:కాంట్రాక్ట్‌ నర్సులు

విశాఖ: కరోనా సమయంలో ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పనిచేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడంపై కాంట్రాక్ట్‌ స్టాఫ్ నర్సులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై నిన్న చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ నిరసన తెలిపారు. తమకు సీఎం జగన్ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కొవిడ్ స్టాఫ్‌ను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్‌ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన హెడ్‌లైన్ షోలో నర్సులో మాట్లాడుతూ తమ సమస్యలను వెల్లడించారు. ఈ వీడియో క్లిక్ చేయండి.

Advertisement
Advertisement