ఇదేం పరిశీలన

ABN , First Publish Date - 2020-08-11T10:37:21+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు ..

ఇదేం పరిశీలన

ఒకవైపు వర్షం..  మరోవైపు బురద

కౌంటర్ల వద్ద కనీస  సౌకర్యాలు కరువు

వైద్యారోగ్య శాఖ పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలనకు

 హాజరైన అభ్యర్థుల అవస్థలు 


ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 10 : వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు ఆదివారం సమాచారం పంపి సోమవారం హాజరు కావాలని చెప్పడం, ఎక్కువ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉండటంతో జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చేరుకునేందుకు ప్రయాణ యాతన అనుభవించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో సర్టిఫికెట్లను సరి చూసుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. ఓ వైపు వర్షం, మరోవైపు బురదలో వారు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు, అందులోనూ గర్భిణులు, బాలిం తలు అవస్థలు వర్ణణాతీతమయ్యాయి. 


స్టాఫ్‌ నర్సు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒంగోలులోని మహిళా డిగ్రీ కళాశాల, వెలుగు భవన్‌లో సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. ఆదివారం రా త్రి నుంచి వర్షం పడుతున్నప్పటికీ అధికారులు ఆ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పిం చకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద అక్కడ పనిచేసే అధ్యాపకులు రోడ్డుపై వాహనాలు నిలపడంతో అభ్యర్థులు పక్కన ఉన్న బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.  ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల అవస్థలు వర్ణణాతీతమయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహనాలు లేకపోయినప్పుటికీ వివిధ మారా ్గల్లో ఒంగోలు చేరుకున్న మహిళా అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన జరిగే  ప్రాంతాలకు వెళ్లేం దుకు అవస్థలు పడ్డారు. ఆటోలు కూడా లేకపోవడంతో అనేక మంది కాలినడకన ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.


ఆదివారం రాత్రి సమాచారం ఇవ్వడం, సోమవారం ఉదయం దూరప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన వారు సర్టిఫికెట్ల నకళ్లు తీయించుకునేందుకు సైతం ఇబ్బంది పడ్డారు.  తొలి రోజు 1178 ఏఎన్‌ఎం పోస్టులకు 530 మంది,  950 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు 417మంది, 802 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 525 మంది సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. 42 రేడియో గ్రాఫర్‌ పోస్టులకు 29 మంది, 21 చైల్డ్‌ ఫిజియాలజిస్ట్‌ పోస్టులకు 17 మంది, 1283 స్టాఫ్‌ నర్సు పోస్టులకు 1043 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారని డీఈవో సుబ్బారావు తెలిపారు. 

Updated Date - 2020-08-11T10:37:21+05:30 IST