అనంతపురం: బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2021-09-30T16:04:22+05:30 IST

అనంతపురం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ నరసింహులు ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు.

అనంతపురం: బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..

అనంతపురం: గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందంటూ ప్రతిపక్షం ఇప్పటికే ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు వినతి పత్రం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ వికలాంగ కాంట్రాక్టర్ నరసింహులు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్బంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన హెడ్‌లైన్ షోలో కాంట్రాక్టర్ నరసింహులు మాట్లాడుతూ.. రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి పనులు చేశామన్నారు. దీనికి గాను పంచాయతీ గ్రాంట్ రూ. 2 లక్షల 80వేల 6 వందలు వచ్చాయన్నారు. మిగిలిన డబ్బులు ఇవ్వకుండా అధికారులు తిప్పుతున్నారని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు వాళ్లు ఇంటికి వస్తున్నారని, బిల్లులు ఇవ్వాలని బ్రతిమిలాడినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను మనస్తాపం చెంది ఎంపీడీవో కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని నరసింహులు ఏబీఎన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-09-30T16:04:22+05:30 IST