Advertisement
Advertisement
Abn logo
Advertisement

పదో రత్నంగా చేర్చండి

బిల్లుల కోసం కాంట్రాక్టర్ల వినూత్న నిరసన

నరసాపురం, నవంబరు 30 : జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో పదో రత్నంగా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లను చేర్చి, పెండింగ్‌ బిల్లులను ఇచ్చి ఆదుకోవాలని  నరసాపురం మునిసిపల్‌ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. బిల్లుల కోసం మంగళవారం మునిసిపల్‌ కార్యాలయం ఎదుట చేతు లకు తాళ్లు కట్టుకుని బందీలుగా నిరసన తెలిపారు. అసోసియేషన్‌ నాయ కులు అడబాల సూర్యచంద్రరావు, సుంకర రంగా తదితరులు మాట్లాడుతూ మూడేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పటికి కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. పనులు చేసి అప్పుల పాలయ్యామని వాపోయారు. న్యాయ స్థానాలు ఆదేశిస్తున్నా అధికారులు స్పందించడం లేదని, గతంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు. అనేక సంక్షేమ పథకాలతో పేదలను అదుకుంటున్న ప్రభుత్వం నవరత్నాల్లో తమను చేర్చి బకాయిలు క్లియర్‌ చేయా లని కోరారు. కాంట్రాక్టర్లు వై.దొరబాబు, గోరు సత్తిబాబు, వసంతరావు, మనోహర్‌ గుప్త, బుజ్జి, మల్లేశ్వరావు, బెల్లంకొండ నాగేశ్వరరావు, వై.పార్థసారథి పాల్గొన్నారు.

Advertisement
Advertisement