పరిశుభ్రతకు సహకరించండి

ABN , First Publish Date - 2021-04-14T05:14:45+05:30 IST

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కోరారు.

పరిశుభ్రతకు సహకరించండి
ట్రాక్టర్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

చీపురుపల్లి : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కోరారు. కర్లాం పంచాయతీకి శ్రీవెంకట రామా పౌలీ్ట్రస్‌ యాజమాన్యం రూ.6 లక్షలు విలువ గల ట్రాక్టర్‌ అందజేయగా, దానిని ఎంపీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసే సామాజిక కార్యక్రమాలకు ప్రజలు కూడా సహకారం అందిస్తే లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బెల్లాన త్రినాఽథరావు,  సర్పంచ్‌ బాణాన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-14T05:14:45+05:30 IST