రోడ్ల విస్తరణ పనులకు సహకరించండి

ABN , First Publish Date - 2022-07-05T04:33:19+05:30 IST

పట్ట ణంలో జరుగుతున్న రోడ్ల విస్తర ణ పనులకు బాధితులు సహక రించాలని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ కోరారు.

రోడ్ల విస్తరణ పనులకు సహకరించండి
రోడ్డు విస్తరణ పనులు పరిశీలిస్తున్న చైర్మన్‌ గట్టు యాదవ్‌

వనపర్తి టౌన్‌, జూలై 4: పట్ట ణంలో జరుగుతున్న రోడ్ల విస్తర ణ పనులకు బాధితులు సహక రించాలని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని పాత యూకో బ్యాంక్‌ దగ్గర జరుగుతున్న విస్త రణ పనులను సోమవారం ఆ యన పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే విస్తరణ ప నులు వేగంగా జరుగుతున్నాయ ని, అక్కడక్కడా కొందరు దురుద్దేశంతో   ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణ అంశం పట్టణ ప్రజలతో పాటు జిల్లా వాసుల చిరకాల కోరికని, అలాంటి పనిని చిత్తశుద్ధ్దితో మంత్రి నిరంజన్‌రెడ్డి చేస్తుండటాన్ని ప్రతీ ఒక్కరు స్వాగతించాలని అన్నారు. పట్టణంలో ఇప్పటికే ప్రజ లకు మౌలిక వసతులు కల్పించడంలో పాలకవర్గం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారి అభివృద్ధ్దిలో రా ష్ట్రంలోనే ప్రథమంగా నిలిపేందుకు మంత్రి సహకా రంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఇటీవల వెలువ డిన ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన  విద్యార్థులను చైర్మన్‌ గట్టు యాదవ్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌,  కౌన్సిల ర్‌ బండారు కృష్ణ, నాయకులు ఎల్‌ఐసీ కృష్ణ,  తోట బాలరాజు, రఘునాయుడు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T04:33:19+05:30 IST