ఎస్సీ వర్గీకరణకు సహకరించాలి: ఎమ్మార్పీఎస్‌

ABN , First Publish Date - 2021-10-25T05:34:48+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కోశాధికారి చింతజాన్‌విల్సన్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలకు తరలివె

ఎస్సీ వర్గీకరణకు  సహకరించాలి: ఎమ్మార్పీఎస్‌
ర్యాలీని ప్రారంభిస్తున్న నాయకులు

సూర్యాపేటటౌన్‌ /కోదాడ, అక్టోబరు 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కోశాధికారి చింతజాన్‌విల్సన్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలకు తరలివెళ్తున్న వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పిడమర్తి ప్రసాద్‌, చింతలపాటి చినశ్రీరాములుమాదిగ, ఊట్కూరి జానకిరాములు, దున్న శ్యాం, కృష్ణ, ప్రభాకర్‌, వీరస్వామి, వెంకన్న, రవి, మల్లేష్‌, సావిత్రి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎంఈఎఫ్‌ మహాసభకు కోదాడ నుంచి ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు లెనిన్‌ మాట్లాడుతూ కేంద్రం ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తరలివెళ్లిన వారిలో ప్రకాష్‌, కోటేష్‌, గురవయ్య, గోపి, బుచ్చయ్య, ఏసోబు, ఏపూరి రాజు ఉన్నారు. 


Updated Date - 2021-10-25T05:34:48+05:30 IST