జిల్లా అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2021-10-22T06:48:57+05:30 IST

నారాయణపేట జిల్లా అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి కోరారు.

జిల్లా అభివృద్ధికి సహకరించాలి
కౌన్సిల్‌ సమావేశ మందిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి

ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి

కౌన్సిల్‌ సమావేశ మందిరం ప్రారంభం

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 21 : నారాయణపేట జిల్లా అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో రూ.80 లక్షలతో నిర్మించిన మటన్‌ మార్కెట్‌ను, ఏడు తడి, పొడి చెత్త వాహనాలను, మునిసిపాలి టీలో ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశ మందిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మటన్‌ మార్కెట్‌ లేక రోడ్లపై విక్రయించే వారిని దృష్టిలో ఉంచుకొని మటన్‌ మార్కెట్‌ సముదాయం ప్రారంభించామని, త్వరలోనే బస్టాండ్‌ ముందు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఇక్కడ పండ్లు, కూరగాయలు, పూలు దుకాణాలు ఉంటాయన్నారు. రూ.12 కోట్లతో అన్నీ వార్డుల్లో సీసీ రోడ్లను వేయిస్తామన్నారు. ఇప్పటి వరకు 2.5 కోట్లతో స్టేడియం నిర్మాణం చేపట్టగా అనుకున్న రీతిలో అది పూర్తికాలేదని మరో 4 కోట్లు అవసరం అన్నారు. జిల్లా గ్రంథాలయం సైతం అవసరమని దానికి నిధులు మంజూరు చేసుకొని నూతన జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించు కుందామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, పుర చైర్‌ పర్సన్‌ గందె అనసూయ, కమిషన్లు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు విజయ్‌ సాగర్‌, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, గందె చంద్రకాంత్‌ పాల్గొన్నారు. 

సింగిల్‌ విండో దుకాణ సముదాయం ప్రారంభం

నారాయణపేట రూరల్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దుకాణ సముదాయాన్ని జిల్లా కేంద్రంలో గురువారం పేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం చేనేత కార్మికులచే తయారు చేసిన చీరలను ప్రజాప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ కొంకల్‌ నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గట్టు విజయ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుగుణ, జడ్పీటీసీ అంజలి, జడ్పీ కో ఆప్షన్‌ తాజుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాములు, యువజన అధ్యక్షుడు మోహన్‌, మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి రాజు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-22T06:48:57+05:30 IST