ఆయిల్‌పామ్‌ తోటలకు సహకారం

ABN , First Publish Date - 2022-03-03T04:57:13+05:30 IST

వనపర్తి మండ లంలోని కడుకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు సరోజినీదేవి, జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) డీజీఎం సంతానం, అసిస్టెంట్‌ మేనే జర్‌ సురభి, సంయుక్త సంచాలకులు సరోజినీ నేతృత్వంలోని బృందం పర్యటించింది.

ఆయిల్‌పామ్‌ తోటలకు సహకారం
కడుకుంట్ల గ్రామంలో ఆయిల్‌పామ్‌ సాగును పరిశీలిస్తున్న నాబార్డు బృందం

- కడుకుంట్ల, కంభాళాపురంలో తోటలను పరిశీలించిన నాబార్డు బృందం 

- మొక్కల పెంపకంపై అధికారుల సంతృప్తి 


వనపర్తి రూరల్‌, మార్చి 2: వనపర్తి మండ లంలోని కడుకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు సరోజినీదేవి, జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) డీజీఎం సంతానం, అసిస్టెంట్‌ మేనే జర్‌ సురభి, సంయుక్త సంచాలకులు సరోజినీ నేతృత్వంలోని బృందం పర్యటించింది. ఈ సంద ర్భంగా బృందం సభ్యులు గ్రామంలోని ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించారు. వనపర్తి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేయదలచుకున్న రైతులకు ఇక్కడ ప్రాథమిక, ద్వితీయ ఆయిల్‌పామ్‌ నర్సరీ ని సిద్ధం చేస్తు ఉండడాన్ని వారు పరిశీలించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్‌పామ్‌ సాగు చేయదలచిన సుమారు ఆరువేల ఎకరాలకు సరిపడా ఆయిల్‌పామ్‌ మొక్కలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచడాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆయిల్‌పామ్‌ నారు మొక్కల యాజ మాన్యం పద్ధతులను వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా గత సంవ త్సరంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద సాగు చేసిన ఆయిల్‌పామ్‌ రైతు క్షేత్రాలను వారు సందర్శిం చారు.  ఆయిల్‌పామ్‌ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అధికంగా ప్రోత్సహించడం వల్ల జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక తోడ్పాటు అందించాలన్న ఉద్ధేశంతో నాబార్డ్‌ బృందం వనపర్తి జిల్లాలో సా గు చేస్తున్న ఆయిల్‌ పంటలను పరిశీలించినట్లు బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పరిశ్రమల శాఖ అధికారి సురేష్‌, ఉ ద్యాన అధికారులు కృష్ణయ్య, ఆయిల్‌ పామ్‌ క్షేత్ర సిబ్బంది, సతీష్‌, కరుణాకర్‌, రైతులు ఉన్నారు.  

 కంభాళాపురంలో...

శ్రీరంగాపూర్‌ : మండలంలోని కంభాళాపురం గ్రామంలో రైతులు పెంచుతున్న ఆయిల్‌పామ్‌ తోటలను నాబార్డ్‌ అధికారులు బుధవారం పరిశీ లించారు. నాబార్డ్‌ డీజీఎం సంతానం, అసిస్టెంట్‌ మేనేజర్‌ సురభి, జాయింట్‌ డైరెక్టర్‌ సరోజిని, జిల్లా హార్టికల్చర్‌ అధికారి సురేష్‌, కృష్ణ, కమలాకర్‌ త దితరులు తోటలను పరిశీలించారు. ఈ సందర్భం గా తోటల పెంపకంపై పలు విషయాలను వారు రైతులనడిగి తెలుసుకున్నారు. 40 ఎకరాల్లో ఆయి ల్‌పామ్‌ తోటలను పెంచుతున్నామని, సబ్సిడీ సౌకర్యం కల్పించాలని రైతులు వారిని కోరారు. 

Read more