అధిక రక్తపోటును నియత్రించండిలా..!

ABN , First Publish Date - 2021-08-04T05:35:26+05:30 IST

అధిక రక్తపోటు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. గుండెపోటు, స్ట్రోక్‌కు ప్రధాన కారణం అధిక రక్తపోటే. అయితే హై బీపీ సమస్యకు మందులు మింగడం ఒక్కటే పరిష్కారం కాదు.

అధిక రక్తపోటును నియత్రించండిలా..!

ధిక రక్తపోటు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. గుండెపోటు, స్ట్రోక్‌కు ప్రధాన కారణం అధిక రక్తపోటే. అయితే హై బీపీ సమస్యకు మందులు మింగడం ఒక్కటే పరిష్కారం కాదు. ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాలి. ఏం చేయాలంటే...


అధికరక్తపోటుకు సోడియంకు సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడయింది. కాబట్టి ఉప్పు తీసుకోవడాన్ని బాగా తగ్గించాలి. రోజూ ఆహారపదార్థాల్లో ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దాని ప్రభావం గణనీయంగా కనిపిస్తుంది. ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌, ప్యాకింగ్‌ ఫుడ్‌లో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.


సోడియం తక్కువ తీసుకోవాలి. అదే సమయంలో పోటాషియం ఎక్కువ తీసుకోవాలి. అధికరక్తపోటుతో బాధపడుతున్న వారికి కావాల్సిన పోషకం ఇది. పోటాషియంను కొద్దిగా తీసుకున్నా అది శరీరంలో అధికంగా ఉన్న సోడియంను తొలగించి రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పుచ్చకాయ, అరటిపండు, ఆరెంజ్‌, అప్రికాట్‌, టొమాటో, బంగాళదుంప, ఆకుకూరలు, నట్స్‌, పాలు, సాల్మన్‌ చేపలు, పెరుగులో సోడియం పుష్కలంగా లభిస్తుంది.


రోజూ క్రమంతప్పకుండా 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని,  జబ్బుల బారినపడకుండా కాపాడుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారైతే రోజూ తప్పక వ్యాయామం చేయాలి. వ్యాయామాలంటే కసరత్తులు చేయాల్సిన పనిలేదు. అరగంట పాటు వాకింగ్‌ చేసినా చాలు. 


స్మోకింగ్‌, ఆల్కహాల్‌ అలవాటు అధికరక్తపోటుకు కారణమవుతాయి. కాబట్టి ఈ రెండింటిని వదిలేయాలి. ప్రపంచవ్యాప్తంగా 16 శాతం అధిక రక్తపోటు కేసులకు ఆల్కహాల్‌ కారణమని పరిశోధనల్లో వెల్లడయింది. ఆల్కహాల్‌, నికోటిన్‌ రక్తపోటు స్థాయిలను పెంచి రక్తనాళాలు దెబ్బతినేలా చేస్తాయి. 


రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్లు, పంచదారతో చేసిన పదార్థాలు అధిక రక్తపోటుకు కారణమవుతాయి. ఈ పదార్థాలను తీసుకోవడం తగ్గించడం ద్వారా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు, పంచదారకు బదులుగా బెల్లం, తేనె ఉపయోగించడం చేయడం ద్వారా అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేయవచ్చు.

Updated Date - 2021-08-04T05:35:26+05:30 IST