Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీ వర్షాల నేపధ్యంలో జీహెచ్‌ఎంసిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

హైదరాబాద్‌: గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్ష సూచన నేపధ్యంలో సహాయ కార్యక్రమాల కోసం జీహెచ్‌ఎంసిలో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసినట్టు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచే భారీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో జంటనగరాల్లో వరద కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఇతరులు సహాయం కోసం 040-21111111 సంప్రదించాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణాలను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం సూచనతో డిఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి నగరం అతలా కుతలం అయ్యింది. నగరంలోని పలు కాలనీలు, బస్తీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Advertisement
Advertisement