రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానం

ABN , First Publish Date - 2020-05-27T10:20:23+05:30 IST

రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగువిధానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే

రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానం

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌


హుజూరాబాద్‌, మే 26: రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగువిధానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌ కిట్స్‌ కళాశాల ఆడిటోరియంలో చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌ విండో అధ్యక్షులు, సభ్యులు, రైతుబంధు సభ్యులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సూచనల మేరకు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలన్నారు. మెట్ట ప్రాంతంలో ఉన్న మండలాలకు మిడ్‌ మానేరు నుంచి నీటిని విడుదల చేసి చెరువులు నింపేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ కె శశాంక మాట్లాడుతూ  జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు.


జిల్లాలో 1.71 లక్షల మంది రైతులకు రైతుబంధు, 96వేల మందికి బీమా అమలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టూరిజం శాఖ చైర్మన్‌ భూపతిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌, ఏడీఏ యాదవరెడ్డి, రెండు మండలాలల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T10:20:23+05:30 IST