కొత్త కొత్తగా..!

ABN , First Publish Date - 2020-05-25T09:40:51+05:30 IST

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాంప్రదాయక పంటలు వేసే జిల్లా రైతులకు ఇప్పుడు మళ్లీ వ్యవసాయం కొత్త కొత్తగా మారనుంది.

కొత్త కొత్తగా..!

నియంత్రిక వ్యవసాయ విధానానికి అనుగుణంగా పంటల మార్పిడి

మొక్కజొన్న పంట సాగుకు రాం..రాం..

భారీగా పెరుగనున్న కంది, పత్తి పంటలు

జిల్లాలో కొత్తగా 27 వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం సాగుకు ఏర్పాట్లు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాంప్రదాయక పంటలు వేసే జిల్లా రైతులకు ఇప్పుడు మళ్లీ వ్యవసాయం కొత్త కొత్తగా మారనుంది. రోహిణి దాటిందంటే నారుమడులు వేసుకుని దుక్కులు దున్నుకుని వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేసే జిల్లా రైతులు ఇప్పుడు కొత్త వ్యవసాయ విధానంపై అడుగులు వేయాల్సి వస్తోంది. డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని, వానా కాలంలో మొక్కజొన్న పంట సాగు చేయవద్దని, సన్న రకం వరి ధాన్యమే సాగు చేయాలని ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం జగిత్యాల జిల్లా రైతులను ఆలోచనలో పడేసింది. 


జిల్లాలో 100 శాతం సన్న రకం ధాన్యం సాగుకు ఏర్పాట్లు

జగిత్యాల జిల్లాలో వ్యవసాయ అధికారులు ఈ వాన కాలం పంటల సాగు కోసం ఏర్పాట్లు చేశారు. పోయిన వాన కాలం 3,55,362 ఎకరాల్లో పంటలు సాగు కాగా, అందులో వరి పంట 2,28,379 ఎకరా ల్లో సాగైంది. ఈసారి 4,07,864 ఎకరాల్లో అన్ని రకా ల పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఇం దులో వరి 2,38,000 ఎకరాలు సాగవుతుందని అం చనా వేశారు. ఇందులో కేవలం 20 శాతం మేరకే దొడ్డు వడ్లు సాగు కాగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో సన్న రకం వరి ధాన్యం పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 2,28,379 ఎక రాల్లో వానా కాలంలో సన్న రకం వరిధాన్యాలు సా గు చేస్తారని అధికారులు అంచనాలు రూపొందించా రు. ఇందులో జై శ్రీరామ్‌ 39,966 ఎకరాల్లో, చింటు 39,966 ఎకరాల్లో, హెచ్‌ఎంటీ సోనా 11,419 ఎకరా ల్లో, అమన్‌ రకం 5710 ఎకరాల్లో, దస్తరీ 5708 ఎక రాల్లో, తెలంగాణ సోనా 4568 ఎకరాల్లో, బీపీటీ 4568 ఎకరాల్లో, గంగా కావేరీ 2284 ఎకరాల్లో, క్రాఫ్‌ వెరైటీస్‌ 1,14,190 ఎకరాల్లో సాగు చేయాలని అంచ నా వేశారు. ఇప్పుడు రైతుల్లో సన్న రకం వరిధాన్యా ల కోసం అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


మొక్కజొన్న పంటకు రాం..రాం..

జగిత్యాల జిల్లా మొక్కజొన్న పంట సాగుకు ప్రసిద్ధి. గడిచిన వాన కాలంలో 51,666 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు కాగా, ఈ వాన కాలంలో 53,349 ఎకరాల్లో సాగవుతుందని ముందుగా అంచనాలు వే శారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో మొక్కజొన్న పంటకు రైతులు రాం..రాం.. చెప్పాల్సి వస్తోంది. ఆ స్థానంలో కంది, పత్తి పంటల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2019లో పత్తి 28,226 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 38 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. కంది గత వాన కా లంలో 4097 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 21, 850 ఎకరాల్లో సాగు చేసేందుకు అంచనాలు రూ పొందించారు. మొక్కజొన్న పంటకు బదులుగా దా దాపు 16 వేల ఎకరాల్లో కంది పంట సాగు విస్తీర్ణం పెంచే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


పె సర పంట గత వానా కాలంలో 2306 ఎకరాల్లో సా గు కాగా, ఈ వాన కాలంలో 5769 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రూపొందించారు. సోయాబీన్‌ పంట గత వాన కాలం 1717 ఎకరాల్లో సాగు చేయగా, ఈ వాన కాలంలో 1743 ఎకరాల్లో సాగుకు అంచనాలు వేశారు. ఆయిల్‌ ఫాం సాగు గత వాన కాలం జిల్లా లో లేకపోగా, ప్రస్తుతం జిల్లాలో కొత్తగా 27 వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం సాగుకు అంచనాలు రూపొందించారు. ఇందులో జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని రాయికల్‌, బీర్‌పూర్‌, సారంగాపూర్‌, జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండలాల్లో 11,165 ఎకరాల్లో, చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లో 1346 ఎకరాల్లో, ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, వె ల్గటూర్‌ మండలాల్లో 9207 ఎకరాల్లో, కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కో రుట్ల, మెట్‌పల్లి మండలాల్లో 5282 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు రూపొందించారు. ఇతర పప్పు దినుసులతో పాటు నూనె గింజల సాగు జిల్లాలో గత వాన కాలం 32,588 ఎకరాల్లో సాగు కాగా, ప్ర స్తుతం ఇతర పంటలు 3953 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఈ లెక్కన చూసుకుంటే జి ల్లాలో కంది పంట భారీగా పెరుగనుండగా, 10 వేల ఎకరాల్లో కాటన్‌, 27 వేల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం పెరుగనుంది.


26 నుంచి అవగాహన సదస్సులు

జిల్లాలో వానా కాలం పంటల సాగుపై ఈ నెల 26 నుంచి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా లో ప్రభుత్వం తీసుకున్న నియంత్రిక వ్యవసాయ విధానంపై ఏ ఏ పంటలు ఎంత సాగు చేయాలో వ్య వసాయాధికారులు అంచనాలు తయారు చేసి ప్ర భుత్వానికి పంపారు. మరో వారం, 15 రోజుల్లో వా నాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధం అ య్యే అవకాశం ఉండటంతో కొత్త వ్యవసాయ విధా నంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి జి ల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2020-05-25T09:40:51+05:30 IST