Advertisement
Advertisement
Abn logo
Advertisement

Vikarabad: బీజేపీ నేత చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వికారాబాద్: జిల్లా ఎస్పీపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఎ.చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. " బిడ్డా ఎస్పీ గుర్తుపెట్టుకో.. బూట్లు నాకించే పరిస్థితి వస్తుంది" అని ఎస్పీని చంద్రశేఖర్ హెచ్చరించారు. వికారాబాద్‌ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా వికారాబాద్‌‌లో జరిగిన సభలో పోలీసులపై చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. వికారాబాద్‌లో జరిగిన సంజయ్ సభలో హెలికాప్టర్‌తో పూలు చల్లిస్తానని ఎస్పీని పర్మిషన్ అడిగామని ఆయన పేర్కొన్నారు. అయితే హెలికాప్టర్‌తో పూలు చల్లడానికి ఇక్కడ పనిచేస్తున్న సన్యాసి ఎస్పీ అనుమతి ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీని ఉద్దేశించి " బిడ్డా ఎస్పీ గుర్తుపెట్టుకో.. బూట్లు నాకించే పరిస్థితి వస్తుంది" అని చంద్రశేఖర్   వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement