వివాదాస్పదమవుతున్న తహసీల్దార్‌ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-04-14T07:03:41+05:30 IST

నిర్మల్‌ అర్బన్‌ తహసీల్దార్‌ వీఆర్‌ఏల విధులకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అవుతున్నాయి.

వివాదాస్పదమవుతున్న తహసీల్దార్‌ ఉత్తర్వులు
తహసీల్దార్‌ జారీ ఉత్తర్వులు

నిర్మల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ అర్బన్‌ తహసీల్దార్‌ వీఆర్‌ఏల విధులకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అవుతున్నాయి. వీ ఆర్‌ఏలకు తహసీల్‌ఆఫీస్‌ ప్రాంగణంలోని టెన్నిస్‌ కోర్టులో బాల్‌బాయ్స్‌గా విధులు నిర్వహించాలం టూ జారీ చేసిన ఈ ఉత్తర్వులు సోషల్‌ మీడియా లో వైరల్‌ అయ్యాయి. వీఆర్‌ఏ జాబ్‌చార్ట్‌కు విరుద్ధం గా బాల్‌ బాయ్స్‌ విధులు కేటాయించడంపై దుమా రం రేగుతోంది. కాగా దీనిపై అర్బన్‌ తహసీల్దార్‌ శివ ప్రసాద్‌ మాట్లాడుతూ... తహసీల్‌ ఆఫీసులోనే విధు లు కేటాయించామని తెలిపారు. 

అలాంటి ఉత్తర్వులు తప్పే : కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

అర్బన్‌ తహసీల్దార్‌ వీఆర్‌ఏలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు సమంజసం కాదు. కమ్యూనికేషన్‌ లోపంతోనే ఇది జరిగి ఉండవచ్చు. తహ సీల్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో టెన్నిస్‌కోర్టు ఏర్పాటు చేశాం. రెవెన్యూ ఉద్యోగు లందరూ సాయంత్రం ఇక్కడ టెన్నిస్‌తో పాటు ఇతర ఆటలు ఆడుతారు. 

Updated Date - 2022-04-14T07:03:41+05:30 IST