Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంప్రదాయ పంటలను సాగు చేయాలి

చేవెళ్ల/మహేశ్వరం: రైతులు వరి పంటకు బదులుగా ఇతర సంప్రదాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  మంగళవారం ఏర్పాటు చేసిన యాసంగి వరికి బదులుగా ఇతర పంటల సాగు యాజమాన్య పద్ధతుల పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరిపంటకు బదులుగా ఇతర కూరగాయలు, పాతకాలం సంప్రదాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రమాదేవి, ఏవో కృష్ణమోహన్‌, తబస్సుమ్‌, ఏఈవోలు రాజేశ్వర్‌రెడ్డి, రమేశ్‌, అరుణ్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా మహేశ్వరం రైతువేదికలో మండల వ్యవసాయాధికారి కోటేశ్వర్‌రెడ్డి పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమ పంటలకు భూపరీక్షలు చేయించుకోవడంతో పాటు పంటమార్పిడి విధానాన్ని అమలు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. మార్కెట్‌ డిమాండ్‌ను అనుసరించి ప్రతిరైతు వరి పంట విస్తీర్ణం తగ్గించాలన్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలసాగుపై వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement