Abn logo
Apr 10 2020 @ 05:09AM

నాస్తికుడైన నాన్నగారిని మార్చేశారు

సోషల్‌ మీడియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆసక్తికరమైన ట్వీట్లతో ఆకట్టుకుంటున్నారు చిరంజీవి. బుధవారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామితో ఆయనకున్న అనుబంధం గురించి, 1962లో లాటరీలో వచ్చిన హనుమాన్‌ బొమ్మ గురించి చిరంజీవి చేసిన ట్వీట్‌కు ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఆ ఫొటోకు సంబంధించి ఆసక్తికర విషయాలు పవన్‌ తెలిపారు. ‘‘అన్నయ్య చిరంజీవితోనే మా ఇంట్లో ఆంజనేయస్వామిని పూజించడం మొదలైంది. ఆ భక్తి కమ్యూనిస్టు, నాస్థికుడైన మా నాన్నగారిని రామ భక్తునిగా మార్చింది. టీనేజ్‌లో ఉండగా నేను కూడా పలు సందర్భాల్లో హనుమాన్‌ చాలీసా 108 సార్లు పఠించేవాడిని. జై హనుమాన్‌’’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement