దోషులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2021-05-10T05:13:30+05:30 IST

కలసపాడు మండలం మామిళ్లపల్లె మైనింగ్‌లో జరిగిన పేలుడుపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దోషులను కఠినంగా శిక్షించాలి
మాట్లాడుతున్న వంగళ శశిభూషణ్‌రెడ్డి

బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి

కడప(మారుతీనగర్‌), మే 9: కలసపాడు మండలం మామిళ్లపల్లె మైనింగ్‌లో జరిగిన పేలుడుపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా మైనింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతూ అన్యాయంగా 10 మందిని పొట్టన పెట్టుకున్న వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సరైన అనుమతులు లేకుండా మైనింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న లీజుదారులను వదిలిపెట్టవద్దన్నారు. కాగా పేలుడు సంఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. 


జిల్లా నూతన కార్యవర్గ నియామకం

సమావేశానంతరం భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించారు. ఎన్నికైన వారికి శశిభూషణ్‌రెడ్డి చేతులమీదుగా నియామకపు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. వారిలో జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.భాస్కర్‌రెడ్డి, ఎస్‌.రామార్జునరెడ్డి, పి.రామగంగిరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, పి.రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శులుగా డి.మహేశ్వర్‌రెడ్డి, డి.రఘనాథరెడ్డి, కార్యదర్శులుగా కె.ఏసుదాసు, వి.భాస్కర్‌రెడ్డి, వై.భార్గవ్‌యాదవ్‌, జి.వెంకటసుబ్బారెడ్డి, ఎం.శివకృష్ణ కోశాధికారిగా లక్ష్మినారాయణ నియమితులయ్యారు. సమావేశంలో బీజేపీ నాయకులు కందుల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-10T05:13:30+05:30 IST