వంట నూనె ధరలు తగ్గాయ్...

ABN , First Publish Date - 2021-06-17T22:27:52+05:30 IST

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వంట నూనెల దిగుమతుల​పై ‘పన్ను’ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

వంట నూనె ధరలు తగ్గాయ్...

హైదరాబాద్ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వంట నూనెల దిగుమతుల​పై ‘పన్ను’ తగ్గిస్తూ  నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీడీటీ)... ఈ ‘దిగుమతి తగ్గింపు’ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో... కొత్త ధరలు... ఈ రోజు(జూన్ 17) నుంచే మల్లోకి వచ్చాయి.  కొత్త ధరల వివరాలిలా ఉన్నాయి. 


* పామాయిల్‌ ధర 2021 మే 7వ తేదీ నాటికి రూ. 142 కాగా, ఇప్పుడు కిలోకు రూ. 115 వరకు దిగి వచ్చింది. 

* అలాగే 2021, మే 5 నాటికి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలోకు రూ. 188 కాగా, ఇప్పుడు కిలోకు 16 శాతం మేర అంటే రూ. 157కు పడిపోయింది.

* 2021, మే 20 నాటికి సోయా ఆయిల్‌ కిలోకు రూ. 162 కాగా, ముంబైలో కిలోకు రూ. 138 కి పడిపోయింది. 

* ఆవ నూనె విషయంలో 2021, మే 16 నాటికి రూ. 175 ఉండగా, ఇప్పుడు కిలోకు రూ. 157 కు దిగివచ్చింది. 

* 2021 మే 14 నాటికి వేరుశనగ నూనె ధర రూ. 190 ఉండగా, ఇప్పుడు కిలోకు రూ. 174 వరకు దిగి వచ్చింది. 

* ఇక మే 2 నాటికి వనస్పతి ధర కిలో రూ. 154 కాగాగా, తాజాగా రూ. 141 కి దిగి వచ్చింది.


కాగా... కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేకపోవడంతో పోర్ట్‌ల్లో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఈ స్టాక్‌కు క్లియరెన్స్ వస్తుండటంతో మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో నూనె ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంట నూనె కోసం భారత్‌ ఎక్కువగా దిగుమతిపై ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది భారత్‌ వంట నూనె దిగుమతుల కోసం రూ. 75 వేల కోట్లను భారత్ వ్యయం చేస్తోంది. 

Updated Date - 2021-06-17T22:27:52+05:30 IST