ఉపాధి నిధులతో ‘జల హితం’

ABN , First Publish Date - 2020-05-21T10:19:05+05:30 IST

సాగునీటి రంగానికి ఉపాధిహామీ పథకం ఊతం ఇస్తున్నది. జిల్లాలో జల హితం కార్యక్రమం పేరిట శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల పూడిక తీత,

ఉపాధి నిధులతో ‘జల హితం’

ముమ్మరంగా ఎస్సారెస్సీ కాలువల పూడికతీత

పెద్దఎత్తున పనులకు వస్తున్న కూలీలు

పలు చెరువుల్లోనూ పూడికతీత పనులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): సాగునీటి రంగానికి ఉపాధిహామీ పథకం ఊతం ఇస్తున్నది. జిల్లాలో జల హితం కార్యక్రమం పేరిట శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల పూడిక తీత, చెత్తాచెదారం, పిచ్చిమొక్కల తొలగింపు కోసం, చెరువుల్లో పూడిక తీత పనులకు జిల్లా అధికార యంత్రాంగం ఉపాధిహామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. పదిహేను రోజుల నుంచి సంబంధిత అధికారులు ఎస్సారెస్పీ కాలువల్లో పేరుకుపోయిన పూడిక మట్టి, చెత్తాచెదారం, తుంగ, పిచ్చిమొక్కలను ఉపాధిహామీ కూలీల ద్వారా తొలగిస్తున్నారు. వచ్చే వార్షాకాలం నాటికి ఆయకట్టు భూముల కు ఎస్సారెస్పీ కాలువలను సంసిద్ధం చేస్తున్నారు. ఉపాధి నిధులతో పలు చెరువుల్లో పూడిక తీత పనులను చేపడుతున్నారు. గుట్టల మీద కురిసే వర్షం నీరంతా జారీ వాగుల గుండా వెళ్లకుండా ఉండేందుకు గుట్టల చుట్టూ కాంటూరు కందకాలను తవ్వుతున్నారు. 


జిల్లాలోని సుమారు 1,78 లక్షల ఎకరాల భూములకు ఎస్సారెస్పీ నీళ్లు వస్తుంటాయి. డి-83, డి-86 కాలువల ద్వారా నీళ్లు సరఫరా అవు తాయి. డి-83 కాలువ కింద జిల్లాలో 1,06,623 ఎకరాల ఆయకట్టు ఉండగా, గుండారం చెరువు ఎగువ భాగాన 42 కిలోమీటర్ల వరకు కాలువ ఉండగదా, దిగువన 39.43 కిలోమీటర్ల కాలువ ఉన్నది. దాదా పు 82 కిలోమీటర్ల కాలువ, ఇదేగాకుండా మైనర్‌ కాలువలు కూడా ఉన్నాయి. డి-86 కాలువ కింద 86,320 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ కాలువ పొడవు 54.2 కిలోమీటర్లు కాగా, దీని కింద ఉప కాలువలు కూడా ఉన్నాయి. ఈ కాలువలన్నింటినీ వానా కాలం పంటకు సంసిద్ధం చేస్తున్నారు. జలహితం కార్యక్రమం పేరిట ఉపాధిహామీ పథకం నిధు లను సద్వినియోగం చేసుకుంటూ పనులు చేస్తున్నారు. ఈ పనులకు రోజుకు 25 వేల నుంచి 30 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. గతంలోనూ ఉపాధిహామీ పథకం ద్వారా ఎస్సారెస్సీ కాలువల పూడిక తీత పనులు చేపట్టినప్పటికీ, ఈ ఏడాది పూర్తి స్థాయిలో మొత్తం కాలువల్లో పూడిక తీయిస్తున్నారు.


ఈ ఏడాది కూడా ఆశించిన మేరకు వర్షాలు పడతాయని అధికారులు ఆశిస్తున్నారు. జూలై నెలాఖ రులోపు కాలువల మరమ్మతు పనులను పూర్తి చేయాలని నిర్ణ యించారు. ఉపాధిహామీ పథకం నిధులనే గాకుండా, మెటీరి యల్‌ పనులకు ఇతరత్రా పనులను సద్వినియోగం చేసుకుంటు న్నారు. కాలువ చివరి భూముల వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీళ్లు సాఫీగా పోయేందుకు వీలుగా పనులను చేపడు తున్నారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కాలువ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు న్నారు. గత ఏడాది ఆశించిన దానికంటే భారీ వర్షాలు కురిశా యి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండడంతో రెండు పంటలకు సరి పడా నీళ్లు వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున పంటలు సాగయ్యాయి. ఈసారి వర్షాలు భారీగా పడే సూచనలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. 


జూలై నాటికి కాలువలను సిద్ధం చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా కాలువ పూడికతీత పనులను ముమ్మరం చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న కాలువలను గుర్తించి పనులు చేయిస్తున్నారు. ఈ పనులతో కూలీలకు ఎక్కువ పనులు దొరుకుతున్నాయి. ఈ పని చేయ డం కూడా సులువే కావడంతో చాలా మంది కూలీలు పను లకు హాజరవుతున్నారు. 


Updated Date - 2020-05-21T10:19:05+05:30 IST