Abn logo
Sep 5 2021 @ 12:16PM

సహకార సంఘాలను బలోపేతం చేయాలి

సహకార బ్యాంక్‌ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు


బాపట్ల: సహకార సంఘాలను బలోపే తం చేయాలని జిల్లా కేంద్ర సహకారబ్యాంక్‌ చైర్మన్‌ రాతం శెట్టి సీతారామాంజనేయులు తెలిపారు. బాపట్ల ఎన్జీవో అసోసియేషన్‌ హాలు నందు శనివారం సహకార సంఘాల చైర్మన్‌లతో సమావేశం ఏర్పా టు చేశారు. సమావేశానికి ఆయన అధ్యక్షతన వహించి మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న సహకార పరపతి సంఘాల ద్వారా స్వల్ప, మద్య, దీర్ఘకాలిక రుణాలు సంఘరైతులకు సకాలంలో అందించాలని చెప్పారు. స్వయం సహాయక సంఘా లకు కూడా తక్కువ వడ్డీకి రుణాలు పొందే ఏర్పాటు చేయాలన్నారు. ప్రాసెసింగ్‌ చార్జీలు లేకుండా రుణాలిచ్చే విధంగా చూడాలన్నారు. తద్వారా సంఘాలను లాభాల బాటలో నడిపించాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ పీటం వెంకటేశ్వరరావు, సీఈవో టి.కృష్ణవేణి, జనరల్‌ మేనేజర్‌ పిన్నక శేషుబానురావు, బ్యాంక్‌ డీజీఎం వీవీఎస్‌ ఫణికుమార్‌, ఏజీఎం ఎం.నాగనాధరావు, బాపట్ల బ్రాంచ్‌ మేనేజర్‌ పిట్టు శ్రీనివాసరెడ్డి, కాకుమాను, ఖాజీపాలెం, నిజాంపట్నం బ్రాంచ్‌ మేనేజర్‌లు, సహకార సంఘాల చైర్‌పర్సన్లు పాల్గొన్నారు.