భయాందోళనలు తొలగించేందుకే కార్డన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2021-07-31T07:05:15+05:30 IST

ప్రజల్లో భయాందోళనలకు తొలగించేందుకే పోలీస్‌శాఖ కార్డెన్‌సెర్చ్‌ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహిస్తుందని డీఎస్పీ ఉపేం దర్‌రెడ్డి అన్నారు.

భయాందోళనలు తొలగించేందుకే కార్డన్‌సెర్చ్‌
మాట్లాడుతున్న డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 30 : ప్రజల్లో భయాందోళనలకు తొలగించేందుకే పోలీస్‌శాఖ కార్డెన్‌సెర్చ్‌ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహిస్తుందని డీఎస్పీ ఉపేం దర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌ మండలంలోని అనంతపేట్‌ గ్రామంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధా నబాధ్యత అని అన్నారు. గ్రామప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తోడ్పడు తుందన్నారు. గ్రామంలో కొత్తవ్యక్తులు గానీ నేరస్తులు గానీ ఆశ్రయం పొందుతు న్నారా అన్నది తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అలాంటి సమాచారం ఎప్పటిక ప్పుడు పోలీస్‌ అధికారులకు అందించాలన్నారు. తద్వారా నేరరహిత గ్రామాలుగా చేసేందుకు కృషిచేస్తామని అన్నారు. నేనుసైతం కార్యక్రమంతో ఆయా గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, గ్రామ కులపెద్దలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చిన్నసంఘటన అయినా తెలుసుకుని ప్రజలను రక్షించవచ్చునని వివరించారు. ప్రజలు పోలీసులకు సహక రించాలని విజ్ఞప్తి చేశారు. పత్రాలు సరిచూసుకోనిదే పాత వాహనాలు కొనుగోలు చేయరాదని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం 8333986939 నెంబర్‌కు తెలియజేయాలన్నారు. లేదా 100 నెంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు. తనిఖీల్లో 61 మోటార్‌సైకిళ్లు, 5 ఆటోలు, ఒక కారు, రూ.13 వేల విలువైన మద్యం,  రూ.300 ల నిషేధిత గుట్కా స్వాధీన పర్చుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. సీఐలు వెంకటేష్‌, జీవన్‌రెడ్డి, ఎస్సైలతో పాటు పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-07-31T07:05:15+05:30 IST