కొత్తిమీర కిలో రూ.260

ABN , First Publish Date - 2021-10-22T06:22:12+05:30 IST

కొత్తిమీర ధర అమాంతం పెరిగింది. వారం క్రితం వరకు రూ.100లోపే పలికిన కిలో కొత్తిమీర.. ప్రస్తుతం రూ.260 పలికింది.

కొత్తిమీర కిలో రూ.260

వర్షాలకు దెబ్బతిన్న పంట.. పెరిగిన ధర

హిందూపురం, అక్టోబరు 21: కొత్తిమీర ధర అమాంతం పెరిగింది. వారం క్రితం వరకు రూ.100లోపే పలికిన కిలో కొత్తిమీర.. ప్రస్తుతం రూ.260 పలికింది. అయినా.. కొత్తిమీర దొరకడం గగనమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడమే ఇందుకు కారణమని వ్యాపా ర వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తిమీర హిందూపురం మార్కెట్‌లో కిలో రూ.260కి చేరడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. పండగలు, శుభకార్యాల సమయంలో కొత్తిమీరకు కాస్త ధర పలుకుతున్నా.. సాఽధారణ రోజుల్లో కిలో రూ.60 నుంచి రూ.80లోపే ఉండేది. వారం రోజులుగా మార్కెట్‌లో కొత్తిమీర దొరకట్లేదు. వారం క్రితం వరకు కిలో కట్ట వందలోపే ఉండగా.. నాలుగు రోజులుగా రూ.260 పెట్టినా మార్కెట్‌లో దొరకడం లేదు. ధరలు పెరగడానికి ఇటీవల కురిసిన వర్షాలే కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పంటను ఏడాది పొడవునా రైతులు సాగు చేస్తున్నారు. పండించిన పంటను రోజూ హిందూపురం ప్రాంతాలతోపాటు కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారు. కొత్తిమీర ధరను చూసి, చిరు వ్యాపారులు మార్కెట్‌లో కొనుగోలు చేయడమే మానేశారు. దీంతో కొత్తిమీర దొరకట్లేదు. కొత్తిమీర లేకుండానే వంటలు వండుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 20 రోజులదాకా కొత్తమీర ధరలు తగ్గపోవచ్చునని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2021-10-22T06:22:12+05:30 IST