Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌: ఓ కప్పు (ఉడికించినది), క్యాప్సికమ్‌: ముప్పావు కప్పు(ముక్కలు), బ్రెడ్‌ ముక్కలు: పది, వైట్‌ సాస్‌: మూడు స్పూన్లు, చీజ్‌: పావు కప్పు, బటర్‌, ఉప్పు, మిరియాల పొడి: తగినంత


తయారు చేసే విధానం: ఓ గిన్నెలో బ్రెడ్‌, బటర్‌ తప్ప మిగిలినవన్నీ వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అన్ని బ్రెడ్‌ ముక్కల పై బటర్‌ను రాయండి. ఓ స్పూనుతో స్వీట్‌ కార్న్‌ ముద్దను తీసుకుని బ్రెడ్‌పై దట్టించండి. మరో బ్రెడ్‌ ముక్కను దానిపై మూసి సాండ్‌విచ్‌ మేకర్‌లో కాసేపు వేడి చేయాలి. టోస్టర్‌ లేదా ఓపెన్‌లో వేడి చేసినా పర్వాలేదు. బయటికి తీసి దాన్ని త్రిభుజాకారంలో కట్‌ చేస్తే కార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌ రెడీ.

చిత్రాన్నంచైనీస్‌ పాన్‌కేక్స్‌ఇడ్లీ ఫ్రైమ్యాంగో ఫిర్నిసాంబార్‌ పొడిమ్యాంగో ఐస్‌ టీహరా భరా కబాబ్‌తాజా నెయ్యి ఇంట్లోనే...సొరకాయ కూటు పచ్చి మామిడి జెల్లీ
Advertisement