నగర శివారులో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-16T05:56:18+05:30 IST

కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం 1,007 కరోనా పరీక్షలు నిర్వహించగా... 323 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో

నగర శివారులో విజృంభిస్తున్న కరోనా
ఓల్డుబోయిన్‌పల్లిలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్న దృశ్యం

నగర శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, బస్తీదవాఖానాల వద్ద వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు జనం బారులు తీరుతున్నారు.


కూకట్‌పల్లిలో 323 కరోనా కేసులు

కూకట్‌పల్లి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం 1,007 కరోనా పరీక్షలు నిర్వహించగా... 323 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 132 పరీక్షలు నిర్వహించగా... 41 పాజిటివ్‌, హస్మత్‌పేటలో 107 మందిలో 59, జగద్గిరిగుట్టలో 146 మందిలో 58, బాలానగర్‌లో 133 మందిలో 53, పర్వత్‌నగర్‌లో 75 మందిలో 8, మూసాపేటలో 163 మందిలో 45, ఎల్లమ్మబండలో 131 మందిలో 36, బస్తీదవాఖానాలైన కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో 70 మందిలో 18, వెంకటేశ్వరనగర్‌లో 50 మందిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.


ఓల్డుబోయినపల్లిలో 68..

ఓల్డుబోయినపల్లి: ఓల్డుబోయినపల్లి డివిజన్‌ పరిధిలోని యూపీహెచ్‌సీలో గురువారం 107 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా 59 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంజయ్యనగర్‌ బస్తీ దవాఖనాలో 24 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 


కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 151..

షాపూర్‌నగర్‌: కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంటసర్కిళ్ల పరిధిలో గురువారం 551 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 151 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్‌ పీహెచ్‌సీలో 128 మందిలో45, గాజులరామారంలో 75 మందిలో 19, షాపూర్‌నగర్‌లో 106 మందిలో 20, సూరారంలో 123 మందిలో 48మందికి, రంగారెడ్డినగర్‌లో 57మందిలో 8మందికి, జీడిమెట్లలో 62మందిలో 11మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు.


శేరిలింగంపల్లి నియోజకవర్గంలో...

చందానగర్‌: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గంలో గురువారం 111 మందికి కరోనా పరీక్షలు చేయగా 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హఫీజ్‌పేట్‌లో 118 మందిలో 9, శేరిలింగంపల్లిలో 560 మందిలో 118 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని  ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-16T05:56:18+05:30 IST