శివారు ప్రాంతాల్లో కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2021-04-18T07:02:30+05:30 IST

కూకట్‌పల్లి ప్రాంతంలో శనివారం 965 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 294 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో

శివారు ప్రాంతాల్లో కరోనా ఉధృతి

కూకట్‌పల్లిలో 294 కేసులు


కూకట్‌పల్లి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో శనివారం 965 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 294 మందికి  పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 136 మందిలో 44, హస్మత్‌పేటలో 83 మందిలో 31, జగద్గిరిగుట్టలో 108 మందిలో 48, బాలానగర్‌లో 151 మందిలో 59, పర్వత్‌నగర్‌లో 106 మందిలో 20, మూసాపేటలో 181 మందిలో 63, ఎల్లమ్మబండలో 110 మందిలో 22 కేసులు, బస్తీదవాఖానలైన కేపీహెచ్‌బీ 4వఫేజ్‌లో 31 మందిలో 5, వెంకటేశ్వరనగర్‌లో 59 మందిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 


కుత్బుల్లాపూర్‌లో 241..

షాపూర్‌నగర్‌: కుత్బుల్లాపూర్‌, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో 801 మందికి కరోనా పరీక్షలు చేయగా 241 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గాజులరామారంలో 86 మందిలో 28, షాపూర్‌నగర్‌లో 56 మందిలో 7, కుత్బుల్లాపూర్‌లో 135 మందిలో 39, సూరారంకాలనీలో 151 మందిలో 55, జీడిమెట్ల బస్తీదవాఖానలో 124 మందిలో 17, కృష్ణానగర్‌లో 30 మందిలో 11, రంగారెడ్డినగర్‌లో 35 మందిలో 12, దుండిగల్‌ పీహెచ్‌సిలో 146 మందిలో 55, అంబేడ్కర్‌నగర్‌ బస్తీ దవాఖానాలో 38 మందిలో 17మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారి డాక్టర్‌ నిర్మల తెలిపారు.


శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 145..

చందానగర్‌: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శనివారం 853 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 145 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లింగంపల్లి ఆరోగ్య కేంద్రంలో 598 మందిలో 121, రాయదుర్గంలో 121 మందిలో 17, హఫీజ్‌పేట్‌లో 134 మందిలో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు.



Updated Date - 2021-04-18T07:02:30+05:30 IST