ఏజెన్సీలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-11T07:11:32+05:30 IST

కరోన కట్టడి కోసం అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నాలు చేస్తున్నప్పటికి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కోరలు చాస్తోంది. గత పది రోజులుగా ఉట్నూర్‌ ఏజెన్సీలో 216 మందికి కరోన పాజీటీవ్‌లు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఉట్నూర్‌కు చెందిన యువ ఇంజనీరు

ఏజెన్సీలో కరోనా కలకలం
లక్కారం గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ఉట్నూర్‌ ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి 

అయినా.. నిర్లక్ష్యం వీడని ప్రజలు 

అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఉట్నూర్‌, ఏప్రిల్‌ 10: కరోన కట్టడి కోసం అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నాలు చేస్తున్నప్పటికి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కోరలు చాస్తోంది. గత పది రోజులుగా ఉట్నూర్‌ ఏజెన్సీలో 216 మందికి కరోన పాజీటీవ్‌లు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఉట్నూర్‌కు చెందిన యువ ఇంజనీరు మడావి లక్ష్మణ్‌(49) కరోన వైరస్‌కు గురైనట్లు తెలియడంతో ఆయన హఠాన్మరణానికి శుక్రవారం రాత్రి గురయ్యారు. ఏజెన్సీలో నిర్వహిస్తున్న కొవిడ్‌ పరీక్షల్లో 216 మందికి కరోన పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.  కరోన కట్టడి కోసం ప్రభుత్వం అధికార యంత్రాంగం ద్వారా పలు జాగ్రత్తలు వివరిస్తున్నప్పటికి ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. ఉట్నూర్‌ ఏజెన్సీలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  పరిదిలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎడీఎంహెచ్‌వో డాక్టర్‌ కుడిమెత మనోహర్‌ తెలిపారు.  కోవిడ్‌ నిబందనలో బాగంగా ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. లాక్‌డౌన్‌ అమలు చేయడం ద్వారా  ప్రభుత్వం ఆర్థికంగా నష్ట పోవడంతో పాటు ప్రజలు సైతం ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతారని బావిస్తుంది. ప్రజలు తమను తాము కాపాడు కోవడానికి ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తు శానిటేజర్లు  ఉపయోగించాలని ప్రతి ఒక్కరు మాస్క్‌లు దరించాలని ప్రకటించింది. మాస్క్‌లు దరించని వారికి రూ. వెయ్యి జరిమాన విదించాలని ప్రభత్వం ఆదేశించినప్పటికి ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. ప్రజలు ఇ లాగే నిర్లక్ష్యం చేస్తుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

ఇచ్చోడలో 36 పాజిటివ్‌ కేసులు

ఇచ్చోడ రూరల్‌: మండలంతో పాటు గ్రామాలలో ప్రతి రోజు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శనివారంన జరిపినకోవిడ్‌ పరీక్షలలో మండలంలోని నర్సాపూర్‌ ప్రాథమిక ఆసుపత్రి పరిధిలో 8 పాజిటివ్‌ కేసులు, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 28 పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాని, 45 ఏళ్లు దాటిన వారందరు వ్యాక్సిలు వేసుకోవాలని నర్సాపూర్‌, ఇచ్చోడ ప్రభుత్వ వైద్యాధికారులు రవిరాథోడ్‌, హిమబిందు, సాగర్‌లు తెలిపారు.

ప్రజలకు అవగాహన  కల్పిస్తున్నాం

: డాక్టర్‌ కుడిమెత మనోహర్‌, ఏడీఎంహెచ్‌వో, ఉట్నూర్‌

ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు కరోన వైరస్‌ నుంచి కాపాడడానికి వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ ఒక్కరిని మాస్క్‌లు దరించాలని కోరడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాం. 50 శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కరోన ప్రబలుతున్నట్లు కనిపిస్తుం ది. ప్రజలు తమ రక్షణ కోసం మాస్క్‌లు దరించి ప్రాణాలను కాపాడుకోవాలని, భౌతిక దూరం పాటించడం సామాజిక బాధ్యత అని అన్నారు.

Updated Date - 2021-04-11T07:11:32+05:30 IST