కరోనా రెండో దశ నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తం

ABN , First Publish Date - 2021-03-25T22:29:28+05:30 IST

కరోనా రెండో దశ నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది.

కరోనా రెండో దశ నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తం

హైదరాబాద్‌: కరోనా రెండో దశ నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వ్యాక్సినేషన్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారం నుండి 2 వేల సెంటర్లలో వ్యాక్సినేషన్ వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో వెయ్యి, ప్రైవేట్‌లో వెయ్యి సెంటర్లలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు 50 వేల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటామని, పాజిటివ్ వచ్చిన వాళ్ల కాంటాక్ట్స్‌ ట్రెసింగ్‌పై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు.


మరోవైపు తెలంగాణలో కరోనా విజృంభణ మొదలైంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయి. ఈ నెల 12న 216 మందికి ‘పాజిటివ్‌’ రాగా..  23న అది ఏకంగా 431కి ఎగబాకింది. ఫిబ్రవరిలో ఏ రోజూ కేసుల సంఖ్య 200 దాటలేదు. మార్చి రెండోవారం నుంచి వైరస్‌ వ్యాప్తి పెరిగింది. తీవ్రత ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరుకు రోజుకు 600-700 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత వేలకు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి బ్రేక్‌ చేసేందుకే కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచినట్లు తెలిపాయి. 

Updated Date - 2021-03-25T22:29:28+05:30 IST