ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-09T23:51:24+05:30 IST

రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్‌ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరుతోంది.

ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

అమరావతి: రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్‌ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య వందల నుంచి వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. అయినా ఆరోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,81,859 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 4,774 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 20,62,580 మంది కోలుకున్నారు. 


జిల్లాల్లో ప్రభుత్వం చేసే టెస్టుల కంటే ప్రైవేటు ల్యాబ్స్‌ చేసే టెస్టులు అధికంగా ఉన్నాయి. చాలా మంది కరోనా అనుమానితులు ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్ష చేయించుకుని పాజిటివ్‌ నిర్ధారణ కాగానే సాధారణ మందులు వాడేస్తున్నారు. దీని వల్ల కొన్ని వేల కేసులు ప్రభుత్వం దృష్టిలోకి రావడం లేదు. ఈ నిర్లక్ష్యమే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2022-01-09T23:51:24+05:30 IST