కరోనా అట్‌ 788

ABN , First Publish Date - 2022-01-24T05:22:55+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. సగటు పాజిటివ్‌ రేట్‌ 22 శాతానికి పైగానే నమోదవుతోంది. జిల్లా అంతటా కేసులు నమోదవు తున్నాయి. ఆదివారం మరో 788 మందిలో కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెనలో వెల్లడించింది.

కరోనా అట్‌ 788

పాజిటివ్‌ రేట్‌ 23.5 శాతం

కడప, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. సగటు పాజిటివ్‌ రేట్‌ 22 శాతానికి పైగానే నమోదవుతోంది. జిల్లా అంతటా కేసులు నమోదవు తున్నాయి. ఆదివారం మరో 788 మందిలో కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెనలో వెల్లడించింది. పాజిటివ్‌ రేట్‌ 23.5గా నమోదైంది. జిల్లాలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,832కు చేరుకుంది. పలు చోట్ల నమోదైన కేసులను పరిశీలిస్తే ప్రొద్దుటూరులో అత్యధికంగా 178 నమోదయ్యాయి. రామాపురం మండలంలో 61, బద్వేలులో 57, రాయచోటి 44, కడప 40, రాజంపేట 36, రైల్వేకోడూరు 33, కమలాపురం 26, జమ్మలమడుగు 24, సీకేదిన్నె 22, ఎర్రగుంట్ల 19, పోరుమామిళ్ల 18, సిద్ధవటం 18, సంబేపల్లి 14, వీఎనపల్లె 14, కొండాపురం మండలంలో 12 కేసులు, మిగతా చోట్ల అంతకన్నా తక్కువగా నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1,20,995 మంది కరోనా బారిన పడగా 715 మంది మృతిచెందారు. కరోనా నుంచి 1,16,519 మంది కోలుకున్నారు.


చిన్నమండెంలో 11 మంది ఉపాధ్యాయులకు కరోనా

చిన్నమండెం, జనవరి 23: మండలంలో 11 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీనిపై మండల విద్యాశాఖాధికారి శివనాయక్‌ను వివరణ కోరగా.. మల్లూరు హైస్కూల్‌లో ఆరుగురు ఉపాధ్యాయులు, చాకిబండలో ఇద్దరు, దిగువగొట్టివీడులో ఒకరు, కేశాపురంలో ఒకరు, బలిజపల్లె పాఠశాలలో ఒకరు కరోనా బారిన పడ్డారని అన్నారు. పూర్తి స్థాయిలో టెస్టులు చేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందేమోనని తోటి ఉపాధ్యాయులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చాకిబండ పీహెచసీ డాక్టర్‌ పురుషోత్తంరెడ్డిని వివరణ కోరగా ఉపాధ్యాయులకు కరోనా సోకిన విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రోజువారిగా 24 మందికి మాత్రమే టెస్టులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు.

Updated Date - 2022-01-24T05:22:55+05:30 IST